Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : నువ్వునాకునచ్చావ్(nuvvu nAku nachchAv) (2001)
రచన : సిరివెన్నెల (sirivennela)
సంగీతం : కోటి (kOTi)
గానం : టిప్పు, హరిణి (Tippu, hariNi)

పల్లవి :
ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే
ఒప్పుకోవు ఇంకెలాగె సత్యభామా
నన్నుదాటి వెళ్లలేవు
నిన్ను నువ్వు దాచలేవు ఏమి
చెయ్యనయ్యొరామా
అనుకున్నా తప్పు కదా
మోమాటం ముప్పు కదా
మనసైతే ఉంది కదా
మన మాటేం వినదు కదా
పంతం మానుకో...
భయం దేనికో... ॥
చరణం : 1
వద్దన్నకొద్దీ తుంటరిగా
తిరగకలా నా వెనక
నిద్దర్లో కూడ ఒంటరిగా వదలవుగా
నన్నస పెట్టి ఈ సరదా
నేర్పినదే నువు గనక
నా కొంగు పట్టి నడవనిదే
కుదరదుగా
అడుగడుగున ఎదురైతే
ఏ దారీ తోచదుగా
అటు ఇటు ఎటు తేల్చవుగా
మన కథను తొందరగా
ప్రతీచోట నీ నవ్వే పిలుస్తోందిగా॥॥
చరణం : 2
అమాయకంగా చూడకలా
వేడుక లా చిలిపి కల
అయోమయంగా వెయ్యకలా
హాయి వల
నీ మీదకొచ్చి ఉరితాడై వాలదుగా
వాలుజడ
దానొంక చూసి ఎందుకట గుండెదడ
మరిమరి శ్రుతి మించి ఇలా
నను మైమరపించకలా
తడబడి తలవంచి ఇలా
తలపును అణిచేస్తే ఎలా
మరేం చెయ్యనే నీతో ఎలా వేగనే॥॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |