historyIkE andanaTTi - హిస్టరీకే అందనట్టి
చిత్రం : లవ్ ఫెయిల్యూర్(love failure) (2012)రచన : శ్రీమణి(SrImaNi)
సంగీతం : ఎస్.ఎస్.థమన్(S.S.thaman)
గానం : సిద్ధార్థ్, బృందం(siddarth,group)
సాకీ :
హిస్టరీకే అందనట్టి మిస్టరీలే ఈ ప్రేమ
ఎంతలాంటి వాడినైన
బంతులాడుతుందమ్మా
కళ్లగంత కడుతుంది
ఎదకు కంత పెడుతుంది
కన్నువిప్పు కలిగే లోపే...
పల్లవి :
నేను లవ్ ఫెయిల్యూర్... (2)
హే... ప్రేమ పాట నవ్వులాట ఒక్కటేరా
హే... ఓడిపోయే ఆట ఇది ఆడకురా
ప్రేమనే కరెంట్ వైర్ పట్టుకోకు
కరెంట్ షాక్ కొట్టినట్టు కొట్టుకోకు
ప్రేమ మెమరీ ఫోన్ మెమరీ ఒక్కటేరా
కుప్ప లారీ ఊడ్చినట్టే
ఇట్స్ ఓవర్ ఇట్స్ ఓవర్
నిజంగా ఇట్స్ ఓవర్
నేను లవ్‌లో ఫెయిల్ అయ్యానే...
అనుపల్లవి :
పార్వతి పార్వతి...
ఇంటర్‌వెల్‌లో వదిలి వెళ్లావే
పార్వతి హే... పార్వతి
వెంటే ఉంటూ మంట పెట్టావే
పార్వతి హే... పార్వతి
గుండె పిండి గుండు కొట్టావే
పార్వతి హే... పార్వతి
రివర్స్ గేర్ వేసి పోయావే॥
మేము లవ్ ఫెయిల్యూర్...
హే.. పార్వతి...
వై డిడ్ యూ గో ఎవే
చరణం :
హే... అమెరికాని కనుక్కొంది కొలంబస్సు
ఈ ప్రేమకెవరో చెప్పలేదే సిలబస్సు
కౌనురే కౌనురే చెప్పు మామా
గొయ్యి తీసి వాడిని పూడ్చి పెట్టు మామా
కోటికొక్కడైన ప్రేమ గెలిచినట్టు
మచ్చుకైన అచ్చు లేదే॥ఓవర్॥
పార్వతి పార్వతి...
స్టేటస్ సింగల్ అయిపోయానే
పార్వతి హే... పార్వతి
రిలీజ్‌కి ముందే ఫ్లాప్ అయ్యానే
పార్వతి హే... పార్వతి
నాకు నేనే మిగిలి పోయానే
పార్వతి హే... పార్వతి
దేవదాసు అయిపోయానే॥
Special Note:
శ్రీమణి
అసలు పేరు పాగోలు గిరీష్.
స్వస్థలం ప్రకాశం జిల్లాలోని చీరాల. 100% లవ్ సినిమాలోని ‘అహో బాలు...’ పాట ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. తర్వాత సెగ, పిల్ల జమీందార్, బాడీగార్డ్, లవ్ ఫెయిల్యూర్ వంటి చిత్రాలకు పాటలు రాశారు. దాదాపు ఆయన రాసిన పాటలన్నీ హిట్టయ్యాయి.