love anTE caring (Oosaravelli) - లవ్వంటే కేరింగ్(ఊసరవెల్లి)
చిత్రం : ఊసరవెల్లి(oosaravelli) (2011)రచన : అనంత శ్రీరామ్(ananta SrIrAm)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్(dEviSrI prasAd)
గానం : ఫ్రాంకాయిస్ కాస్టలెనొ(frankAyis kAstaleno)
పల్లవి :
లవ్వంటే కేరింగ్ ఫ్రెండంటే షేరింగ్
ఎట్టుందే పిల్లా బోలో నా ఫ్రేమింగ్
ఏంటో నీ ఫీలింగ్
చెప్పేయవే డార్లింగ్
ఎటు అంటే అటు
తిప్పుతాలే నా స్టీరింగ్
లవ్వంటే దొంగల్లే సీక్రెట్‌గా కలవాలే
ఫ్రెండంటే దొరలా
మీటయ్యే ఛాన్సులే
లవ్వంటే రెడ్ రోజ్ కోపంగా ఉంటాడే
ఫ్రెండ్‌షిప్ వైట్ రోజ్
కూల్‌గా ఉంటాడే ॥
ఓసారి లవ్ బెటరంటాడు
ఓసారి ఫ్రెండ్ గ్రేటంటాడు
ఏరోజెలా వీడుంటాడో వీడికె డౌటు
ఓసారి డియర్ అని అంటాడు
ఓసారి ఫియర్ అని అంటాడు
ఏ మూడ్లో ఎప్పుడు ఉంటాడే
నో అప్‌డేటు
చరణం : 1
నీకంట నీరొస్తే నా కర్చిఫ్ అందిస్తా
మళ్లీ అది శుభ్రంగా ఉతికిచ్చై
వెయిట్ చేస్తా
నీ కాళ్లు నొప్పంటే
నిను నేనే మోసుకెళ్తా
దింపాకా నీతోనే నా కాళ్లు నొక్కిస్తా
సిమ్‌కార్డ్ తెమ్మంటే
సెల్‌ఫోనే తెచ్చిస్తా
నువ్వు స్విచ్చాఫులో ఉన్న
రింగ్‌టోన్ మోగిస్తా
అడ్రస్ చెప్పంటే డ్రాప్ చేసి వచ్చేస్తా
పెట్రోల్‌కై నీ క్రెడిట్‌కార్ట్ గీకేస్తా॥
చరణం : 2
లవ్వంటూ చెప్పాలంటే
ఐ లవ్ యూ చాలే
దోస్తి వివరించాలంటే భాషే సరిపోదే
ఏ తప్పంతా నీదైనా
నే సారీ చెబుతాలే
హే... ఫ్రెండ్‌షిప్‌లో ఇగో లేదని
నే చూపిస్తాలే
నిన్నైనా నేడెనా నేడైనా రేపైనా
రేపైనా ఏనాడైనా తోడుంటా
ఎండైనా వానైనా క న్నీరుండే దారైనా
ఏమైనా గాని తోడుండే వాడే
ఫ్రెండంటా ॥