చిత్రం : సీతయ్య (2000)
రచన : చంద్రబోస్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : ఉదిత్ నారాయణ్, చిత్ర
పల్లవి :
ఓ పిల్లా... ఓ... పిల్లా... (2)
అమ్మతోడు నాన్నతోడు
నినుపుట్టించిన బ్రహ్మతోడు
వదలను నిన్నే ఓ పిల్లా... (2)
మీ అమ్మ కాదన్నా మీ నాన్న కాదన్నా
ఆ బ్రహ్మే కాదన్నా వదలను నిన్నే
ఓ పిల్లా... ఓ రాజా... ఓ... రాజా...
కొమ్మతోడు రెమ్మతోడు
కట్టుకు వచ్చిన కోక తోడు
మరువను నిన్నే ఓ రాజా...
ఓ రాజా... ఓ... రాజా...
చరణం : 1
నీ తోడుంటే దీపావళి...
నువు ఊవ్ అంటే ధూపావళి
ఒక్కరు ఉంటే ఏకాదశి
జంటైతే కేకాదశి
సయ్యంటే ప్రతి సంధ్యకి
సుఖాల సంక్రాంతి
నువ్వుంటే ప్రతి రాతిరి
అయ్యేను నవరాత్రి
నా తీగను అల్లితే నాగుల పంచమిలే
నీ సోకులు అందితే గోకుల అష్టమిలే
బ్రతకుంతా సీతారాముల నవమే
ఓ పిల్లా... ॥పిల్లా॥
చరణం : 2
బిడియాలతో బిల్లంగోడు
పిల్లా నేడే ఆడేయనా
వయ్యారంతో వామనగుంటా
ఆడించి ఓడించవా
పెదాల కోలాటాలే ఈవేళ ఆడాలి
గదుల్లో కోతికొమ్మ గలాటా చూడాలి
చలి దాగుడుమూతల
ఆటకు ముందుకు రా
నను గుజగుజ రేకుల
ఆటకు గుంజకురా
మనువాటే ఆడి మొగుడై పోరా
ఓ రాజా... ॥రాజా॥
ఏ కొమ్మ కాదన్నా ఏ రెమ్మ కాదన్నా
నా కోకే కాదన్నా మరువను నిన్నే
ఓ రాజా... ఓ పిల్లా... ఓ పిల్లా...