Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

Oh dEvadA Oh pArvathI - ఓ దేవదా ఓ పార్వతీ

చిత్రం : దేవదాసు(dEvadAsu) (1953)
రచన : సముద్రాల సీనియర్(samudrAla senior)
సంగీతం : సి.ఆర్. సుబ్బరామన్(C.R.subbarAman)
గానం : జమునారాణి, ఉడుతా సరోజిని(jamunArANi,vuDutA sarOjini)
16 March - నేడు సముద్రాల రాఘవాచార్య వర్ధంతి


పల్లవి :
ఓ... దేవదా... ఓ... పార్వతీ...
చదువు ఇదేనా అయ్యవారూ నిదరోతే తమరూ ఇలాగే దౌడో దౌడా...
ఓ... దేవదా... ॥
చరణం : 1
కూనలమ్మ మర్రిలో గిజిగాళ్లున్నాయే
పడితే వాటముగా పట్టుపడేనే॥
బడిమానే ఎడముంటే
ఎపుడూ ఇలాగే ఆటే ఆట (2)
ఓ... పార్వతీ...
చరణం : 2
రెక్కరాని కూనలే పడితే పాపమే
బడిలో నేర్పినదీ ఈ చదువేనా॥
బడిలోనే చదువైతే
బ్రతుకూ ఇలాగే బెదురూ పాటే (2)
ఓ... పిరికి పార్వతీ...
చరణం : 3
తేలెనులే నీ బడాయి
చాలునులే ఈ లడాయి ॥
లడాయిలా సరే మనకు
జిలాయిలోయ్ జిలాయిలోయ్
ఆ... అన్నా ఊ... అన్నా
అలిగిపోయే ఉడుకుమోతా (2)
రా రా పిరికి పార్వతీ...
పో పో దుడుకు దేవదా...

Special Note:
పూర్తిపేరు : సముద్రాల వేంకట రాఘవాచార్య
జననం : 19-7-1902
జన్మస్థలం : పెదపులివర్రు గ్రామం, కృష్ణాతీరం
తల్లిదండ్రులు : లక్ష్మీతాయారు,వేంకట శేషాచార్యులు
చదువు : మెట్రిక్యులేషన్,సంస్కృతంలో భాషాప్రవీణ
వివాహం-భార్య : 1918, రత్నమ్మ
పిల్లలు : కుమారులు (వేంకట రామానుజాచార్యులు, వేంకట శేషాచార్యులు), కుమార్తెలు (కుముదవల్లి, అలమేలు మంగతాయారు)
తొలిపాట - సినిమా : దేవుని మహిమా తెలియగ వశమా - కనకతార (1937)
ఆఖరిపాట - సినిమా : రామకథ శ్రీ రామకథ - శ్రీరామకథ (1968)
పాటలు : దాదాపు 800
దర్శకునిగా : వినాయకచవితి (1957), భక్తరఘునాథ్ (1960), బభ్రువాహన (1964)
నిర్మాతగా : స్త్రీ సాహసం (1951),
శాంతి (1952), దేవదాసు (1953)
గాయకునిగా : హరేకృష్ణ హరేరామ హరే శ్రీకృష్ణహరే (భక్త రఘునాథ్)
ఇతర విషయాలు : సముద్రాల బాల్యమంతా రేపల్లెలో గడిచింది. నాలుగో ఫారం చదువుతున్నపుడే కవిత్వానికి శ్రీకారం చుట్టారు. 1925 నాటికి సాహిత్యాన్ని సమగ్రంగా అధ్యయనం చేశారు సముద్రాల. 1925 నుంచి స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. 1932లో ‘ప్రజామిత్ర’ వారపత్రికకు సంపాదకునిగా చేరారు. ఈ సమయంలోనే సీతాకళ్యాణం (1934), శ్రీకృష్ణలీలలు (1935) చిత్రాలకు ప్రకటనలు రాశారు. ఇది సినిమాకు సంబంధించినంత వరకు సముద్రాల తొలి అడుగు. తెలుగు సినీ గేయ రచనకు కొత్త ఒరవడి తీసుకొచ్చిన సముద్రాలను‘సినీ కవికులగురువు’ గా అభివర్ణిస్తారు.
మరణం : 16-3-1968
విగ్రహం : సముద్రాల 108వ జయంతి సందర్భంగా ఫిలింనగర్ (హైదరాబాద్) లో కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |