Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

oohala pallakIlO - ఊహల పల్లకీలో

oohala pallakIlO - ఊహల పల్లకీలో

చిత్రం : చిత్రం(chitram) (2000)
రచన : కులశేఖర్(kulaSEkhar)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్(R.P.patnAyak)
గానం : ఉష, నీహాల్(usha,nIhAl)


పల్లవి :
ఊహల పల్లకీలో ఊరేగించనా
ఆశల వెల్లువై రాగం పలికించనా॥
కలహంసై కబురులందివ్వనా
రాచిలకై కిలకిల నవ్వనా
నా పెదవుల మధువులే ఇవ్వనా
సయ్యాటలోనా॥
చరణం : 1
ప్రేమలో తీపి చూసే వయసే నీదిరా
బ్రతుకులో చేదులున్న
భయమే వద్దురా
సుడిగుండం కాదురా
సుమగంధం ప్రేమరా
పెనుగండం కాదురా
అనుబంధం ప్రేమరా
సిరి తానుగానే వచ్చి
నిన్ను చేరునురా॥
మేఘాలకు నిచ్చెనే వేయనా
ఆకాశపుటంచులే వంచనా
ఆ జాబిలి కిందకే దించనా
నా కన్నెకూన॥
చరణం : 2
ఆశగా పల్లవించే పాటే నీవులే
జీవితం తోడులేని మూడేంకాదులే
కలిసుండే వేళలో కలతంటూ రాదులే
అమవాసై పోదులే
అడియాశేం కాదులే
చిరుదివ్వె కాంతులింక
దారి చూపునులే॥॥

Comments