Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

vEyi kannulatO (nee snEham) - వెయ్యి కన్నులతో

చిత్రం: నీ స్నేహం(nee snEham) (2003)
సంగీతం: ఆర్.పి. పట్నాయక్(R.P.paTnAyak)
గీతరచయిత:సిరివెన్నెల(sirivennela)
నేపధ్య గానం:ఆర్.పి. పట్నాయక్(R.P.paTnAyak)



పల్లవి:

వెయ్యి కన్నులతో వేచి చూస్తున్నా
తెర చాటు దాటి చేరదా నీ స్నేహం
కోటి ఆశలతో కోరుకుంటున్నా
కరుణించి ఆదరించదా నీ స్నేహం
ప్రాణమే నీకూ కానుకంటున్నా
మన్నించి అందుకోవ నేస్తమా
వెయ్యి కన్నులతో వేచి చూస్తున్నా
తెర చాటు దాటి చేరదా నీ స్నేహం
చరణం 1:
నీ చెలిమే ఊపిరిలా బతికిస్తున్నది నన్నూ
నీ తలపే దీపంలా నడిపిస్తున్నది నన్నూ
ఎంత చెంత చేరినా సొంతమవని బంధమా
ఎంతగా తపించినా అందనన్న పంతమా
ఎంత ఆశ ఉన్నా
నిన్ను పిలిచేదెలాగమ్మ అందాల ఆకాశమా

Special Note:

పూర్తిపేరు : రవీంద్ర ప్రసాద్ పట్నాయక్
జననం : 10-3-1970
తల్లిదండ్రులు: బగ్గాం లక్ష్మి, జ్ఞానకేశ్వరరావు
జన్మస్థలం : జైపూర్
సొంత ఊరు : పార్వతీపురం, విజయనగరం జిల్లా
అన్నదమ్ములు : గౌతమ్ పట్నాయక్, చంద్రమౌళి పట్నాయక్ (ఇద్దరూ సినీ పరిశ్రమలో ఉన్నారు)మ్యూజిక్ డెరైక్టర్, గాయకుడిగా
మొదటి చిత్రం : నీకోసం (1999)
డెరైక్టర్‌గా : అందమైన మనసులో (2008), బ్రోకర్ (2011), ఫేస్‌బుక్ (2012), మ్యూజిక్ (చివరి రెండు సినిమాలు ఇంకా రిలీజ్ అవ్వలేదు)

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |