చిత్రం : శ్రీరాజేశ్వరీవిలాస్ కాఫీక్లబ్(SrI rAjESwarI vilAs coffee club (1976)
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
గానం : పి.సుశీల
03 April - జయప్రద బర్త్‌డే
పల్లవి :
ఆకాశపందిరిలో
నీకు నాకు పెళ్లంట
అప్సరలే పేరంటాళ్లు దేవతలే
పురోహితులంట
దీవెనలు ఇస్తారంట
'ఆకాశ'
చరణం : 1
తళుకుబెళుకు
నక్షత్రాలు తలంబ్రాలు తెస్తారంట (2)
మెరుపుతీగ తోరణాలు
మెరిసి మురిసిపోయేనంట
మరపురాని వేడుకులంట
ఆకాశపందిరిలో నీకు నాకు పెళ్లంట
చరణం : 2
పిల్లగాలి మేళగాళ్లు
పెళ్లిపాట పాడేరంట (2)
రాజహంస జంటచేరి
రత్నహారతిచ్చేనంట
రాసకేళి జరిపేరంట
'ఆకాశ'
చరణం : 3
వన్నెచిన్నెల
ఇంద్రధనుసుపై
వెన్నెల పానుపు
వేసేనంట
'ఆకాశ'
మబ్బులు తలుపులు మూసేనంట... ఆ...
మబ్బులు తలుపులు మూసేనంట
మగువలు తొంగి చూసేరంట
మనలను గేలి చేసేరంట
Click to listen the Song:
AkASa pandirilO - ఆకాశపందిరిలో
AkASa pandirilO - ఆకాశపందిరిలో
Special Note:
జయప్రద అసలు పేరు లలితారాణి. రాజమండ్రిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో ఏప్రిల్ 3, 1962లో జన్మించారు. తల్లిదండ్రులు నీలవేణి, కృష్ణ. తెలుగులో భూమికోసం (1974) చిత్రం ద్వారా పరిచయమైన జయప్రద తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, బెంగాలీ, హిందీ, ఇంగ్లిష్ భాషలలో సుమారు 300 సినిమాలలో నటించారు. తెలుగులో ఎక్కువగా కృష్ణతో (44 సినిమాలు) నటించారు. ‘శ్రీరాజేశ్వరీవిలాస్ కాఫీ క్లబ్’ సినిమా వీరి కలయికలో వచ్చిన మొదటి సినిమా. చివరి సినిమా చంద్రవంశం (1998).