Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

erupu lOlAku - ఎరుపు లోలాకు

చిత్రం : ప్రేమలేఖ(prEmalekha) (1996)
రచన : భువనచంద్ర(bhuvanachandra)
సంగీతం : దేవా(dEvA)
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం(S.P.bAlasubrahmanyam)



పల్లవి : ఎరుపు లోలాకు కులికెను కులికెను
ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను॥
అమ్మమ్మా అందమే
ఏనుగెక్కి పోతుందే
కళ్లతో కొంటెగా సైగలేవో చేస్తుంది
రాజస్థానీ కన్నెపిల్ల వయసుకి
వన్నెలు వచ్చిన వేళ॥
చరణం : 1
మనసంతా మనసంతా
మరుమల్లెల పులకింత
వయసంతా వయసంతా
చిరు కవితల కవ్వింత॥
ఏ ఊరి చల్లగాలి ఈ ఊరికొచ్చెనమ్మా
ఒంటె మీదకెక్కి నన్ను
ఊరు చుట్టూ తిప్పెనమ్మా
ఏటిగట్టు ఊరిగట్టు
నన్ను చూసి పాడంగా
సంగతులు ఎన్నెన్నో
వంతులేసి చెప్పంగా॥॥
చరణం : 2
ఆకాశం ఆకాశం ఈ సుందర ఆకాశం
బహుదూరం బహుదూరం
మనకందని నవలోకం॥
చుట్టి చుట్టి నన్ను చుట్టె
చక్కనైన తోకచుక్క
ముద్దు ముద్దు మాటలాడె
ముచ్చటైన పాలపిట్ట
అందాలే చిందెనులే
లేత నుదుటి కుంకుమలు
పగ్గాలే వేసెనులే
నీలి నీలి ముంగురులు॥॥
Download the song:

erupu lOlAku - ఎరుపు లోలాకు
erupu lOlAku - ఎరుపు లోలాకు

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |