idigO dEvuDu chEsina - ఇదిగో దేవుడు చేసిన
చిత్రం : పండంటి కాపురం(paNDaNTi kApuram) (1972)
రచన : మైలవరపు గోపి(mylavarapu gOpi)
సంగీతం : ఎస్.పి.కోదండపాణి(S.P.kOdaNDapANi)
గానం : ఎస్.పి.కోదండపాణి, పి.సుశీల(S.P.kOdaNDapANi,P.suseela)
05 April - నేడు ఎస్.పి.కోదండపాణి వర్ధంతి
పల్లవి :
ఇదిగో దేవుడు చేసిన బొమ్మ
ఇది నిలిచేదేమో మూడు రోజులు
బంధాలేమో పదివేలు ॥
చరణం : 1
నదిలో నావ ఈ బ్రతుకు...
దైవం నడుపును తన బసకు...॥
అనుబంధాలు ఆనందాలు
తప్పవులేరా కడవరకు
తప్పవులేరా కడవరకు...॥
చరణం : 2
రాగం ద్వేషం రంగులురా
భోగం భాగ్యం తళుకేరా ॥
కునికే దీపం తొణికే ప్రాణం
నిలిచేకాలం తెలియదురా
నిలిచేకాలం తెలియదురా...॥
Special Note:
పూర్తిపేరు: శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి
జననం-జన్మస్థలం : 1932, గుంటూరు
తల్లిదండ్రులు : రాజేశ్వరీదేవి, ఎస్.పి.నందయ్య
చదువు : 9వ తరగతి
తొలి చిత్రం : కన్నకొడుకు (1961)
ఆఖరి చిత్రం : మాంగల్యభాగ్యం (1975) (అసిస్టెంట్ ముత్తు పూర్తి చేశారు)
మొత్తం చిత్రాలు : 101
గాయకునిగా : ‘సంతానం ’ చిత్రంలో ‘సంతోషమేలా సంగీతమేలా’ అనే పాటను జమునారాణితో కలిసి, ‘పండంటి కాపురం ’లో ‘ఇదిగో దేవుడు చేసిన బొమ్మ’ పాట సుశీలతో.
నటించిన సినిమాలు : పొట్టిప్లీడర్ (1966)లో మ్యూజిక్ కండక్టర్‌గా, శ్రీశ్రీశ్రీమర్యాదరామన్న (1967) చిత్రంలో అతిథి పాత్రలో.
ఇతరవిషయాలు : గుంటూరులో... స్కూల్‌ఫైనల్ పరీక్షలో తప్పిన తర్వాత చదువు మీద శ్రద్ధ తగ్గి, సంగీతం, నాటకాల మీద అభిరుచి పెరిగింది. పీసపాటి, అబ్బూరిగార్ల నాటక బృందాల్లో చేరి అనేక పాత్రలలో నటించారు. పాటలు కూడా పాడేవారు. ఆ ఉత్సాహాన్ని చూసి స్నేహితులు సినిమాలలోకి వెళ్లమని ప్రోత్సహించడంతో మద్రాసు కు పయనమయ్యారు. ‘నా ఇల్లు’ చిత్రంలో (తెలుగు, తమిళ భాషల్లో) కోరస్‌లో పాడారు. అంతేకాదు కాస్తోకూస్తో హార్మోనియం వాయించడం కూడా వచ్చు. అది గమనించిన సుబ్రహ్మణ్యం అనే వయోలా విద్వాంసుడు, ‘‘హార్మోనియంలో పట్టు సంపాదించు’’ అని ప్రోత్సహించడంతో... రోజుకు పన్నెండు గంటలపాటు హార్మోనియం వాయిస్తుండేవారు. కొన్నాళ్ల తర్వాత సుసర్ల దక్షిణామూర్తి ఆర్కెస్ట్రాలో చేరారు. ఆ తర్వాత కె.వి.మహదేవన్ బృందంలో కూడా పనిచేశారు. తర్వాత ‘‘రేఖా అండ్ మురళీ’’ (పద్మనాభం) వారి నాటకాలకు సంగీత దర్శకుడయ్యారు. జేసుదాసుతో తెలుగులో మొదటిసారిగా బంగారు తిమ్మరాజులో... ఓ నిండు చందవూమ పాట పాడించడం, బాలు చేత ‘శ్రీశ్రీశ్రీవుర్యాదరావున్న’ చిత్రంలో ఒక చరణాన్ని, ఓ విప్లవాద పద్యాన్ని పాడించి పరిశ్రవుకు పరిచయుం చెయ్యుటం, నటుడైన పద్మనాభం చేత ‘దేవత’లో ‘నా పేరు రాందాసు’ పాట పాడించటం, తనకు తాను పాడుకునే అలవాటు తప్పిపోరుున రేలంగి చేత ’శ్రీరావుకథ’లో ‘చారూ చారూ’ పాట పాడించడం, ఈలపాట రఘురావుయ్యు చేత మొదటిసారి వురొక నటునికి (హీరో కృష్ణ) ‘శ్రీశ్రీశ్రీ వుర్యాద రావున్న’ లో ఓ చరణం పాడించడం, ఎల్.ఆర్.ఈశ్వరి చేత ‘కథానారుుకమొల్ల’లో ఐదు భాషల్లో పాటను పాడించడం... స్వరకర్తగా ఇలా ఎన్నో ప్రయోగాలను చేశారు కోదండపాణి.
మరణం : 05-04-1974