చిత్రం : Mr.నూకయ్య(Mr.nUkayya) (2012)
రచన : రామజోగయ్యశాస్త్రి(rAmajOgayya SAstri)
సంగీతం : యువన్‌శంకర్‌రాజా(yuvan sa~mkar rAjA)
గానం : కార్తీక్, ప్రేమ్‌జీ(kArtIk,prEmjI)
పల్లవి : నోటు నోటు పచ్చనోటు
అయ్యబాబోయ్ చాలా గ్రేటు
దీనివల్లే ఏ మనిషికైనా
గుండెపోటు వెన్నుపోటు
డబ్బుందంటే వేసెయ్యొచ్చు
గాల్లో ఫ్లైటు
డబ్బేగాని లేకపోతే లైఫే టైటు
డబ్బుంటేనే వాళ్లు వీళ్లు నీతో జట్టు
అదే లేకపోతే లవ్వు లవర్ అన్నీ కట్టు
నో మనీ నో మనీ
నో హనీ నో హనీ రా (4)
చరణం : 1 పుడుతూ లేని డబ్బు
మనతో రాని డబ్బు
మనిషికి మంత్రమేసి ఆడిస్తాదీ
డబ్బొక తీపి జబ్బు
కంటికి నల్లమబ్బు
కిరికిరి మాయలెన్నో నేర్పిస్తాదీ
కృష్ణా... శ్రీకృష్ణాతులాభారం స్టోరీలో
నాడు తులసీదళమే గెలిచింది
నేడు తూకంలో ప్రేమ ఓడిపోయింది
అరె లబ్బుడబ్బు
గుండె సౌండు మారింది
డబ్బు డబ్బంటూ కొత్తపాట పాడింది
మనీ మైకంలో నా సొంత మనసే
నన్ను వదిలేసి పోయింది॥మనీ॥
చరణం : 2 పాకెట్ ఫుల్లుగుంటే
పర్సులో చిల్లరుంటే
ప్లాస్టిక్ నవ్వులన్నీ నీ ఫ్రెండ్సేలే
సరుకే నిల్లైపోతే సరదా డల్లైనట్టే
సొంత షాడో కూడా మిస్సింగేలే
అరెరే... ప్రతి మగవాడి
పతనం వెనకాల
ఒక ఆడది ఉంటది కారణంలా...
అందుకే నేను మిగిలాను ఒంటరిలా
అయ్యో... పైసాతో
మనసును కొలవాలా
పచ్చిమోసాల
ముసుగులు తొడగాలా
ప్రేమే పామై కాటెయ్యాలా
నా గుండె పగిలేలా ॥మనీ॥