O prEma hrudaya vINa - ఓ ప్రేమ హృదయ వీణ
చిత్రం : దేవీపుత్రుడు(dEvIputruDu) (2001)రచన : జొన్నవిత్తుల(jonnavittula)
సంగీతం : మణిశర్మ(maNiSarma)
గానం : ఎస్.పి.బాలు, ప్రసన్న(S.P.bAlu,prasanna)
17 April - సౌందర్య వర్ధంతి
పల్లవి :
ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మా
ప్రాణమా...
ఓ ప్రేమ నుదుటిమీద కావమ్మా
కుంకుమ...
పుసుపు పూల వెన్నెల
పసిడి హంస కన్నెలా
చేరుమా చైత్రమా స్నేహమా॥ప్రేమ॥
చరణం : 1
అసలెందుకే ఆ అమృత మే
అనురాగముతో నువు నవ్వితే
రతిసుందరిలా దరిచేరితే
చెలరేగిపోయే యవ్వనమే
సెగ కోరికతో మాటాడితే
కొసచూపులతో తాకితే
మేను మేను ఆని తేలి సోలిపోనీ
ఏది ఏమి కానీ ఏకమవ్వనీ
రా మరి నా చెలి... ॥ప్రేమ॥
చరణం : 2
శహనాయి మోగే కోవెలలో
శశికాంతులతో నను చే రుకో
గృహదేవతవై ఒడిచేర్చుకో
రతనాలు పండే నీ జతలో
సుఖశాంతులతో శ్రుతి చేసుకో
ప్రియలాహిరిలో ఏలుకో
లోకమందు లేని హాయి అందుకోని
కోటి జన్మలన్నీ తోడు ఉండనీ
రా మరి నా చెలి...॥ప్రేమ॥
Oh premaa hrudaya veena neevamma praanamaa...
oh premaa nudhutimeeda kaavammaa kunkumaa..
pasupu poola vennela
pasidi hamsa kannelaa
cheruma chaitrama snehama...
O premaa hrudaya veena neevamma pranama...
Asalenduke aa amrutame..
anuraagamutho nuvvu navvite..
rati sundarilaa daricherithe
cheli regipoye yavvaname
maga korikato maatlaadithe
kosa choopulato taakite
menu menu aani teli soliponee
yedi emi kaani ekamavvani
raa mari...naa cheli
O premaa hrudaya veena neevamma pranama...
Shehanaayi moge kovelalo
sasi kaantulato nanu cheruko
gruha devatavai odi cherchuko
ratanaalu pande nee jathalo
sukha shanthulato sruthi chesuko
priya laahirilo yeluko
lokamandu leni haayi andukoni
koti janmalanni todu undani
raa mari...naa cheli
O premaa hrudaya veena neevamma pranamaa...
o premaa nudhutimeeda kavamma kunkuma..
pasupu poola vennelaa
pasidi hamsa kannelaa
cherumaa...chaitramaa...snehamaa...
Special Note:
‘దేవీపుత్రుడు’... సౌందర్య, వెంకటేష్‌తో నటించిన ఆఖరి సినిమా. మొదటి చిత్రం సూపర్ పోలీస్ (1994). తర్వాత... ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996), పవిత్రబంధం (1996), పెళ్లి చేసుకుందాం (1997), రాజా (1999), జయం మనదేరా (2000) ఇత్యాది చిత్రాలలో ఈ జంట కలిసి నటించారు.