Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : పెళ్లిసందడి(peLli sandaDi) (1996)
రచన : వేటూరి(vETUri)
సంగీతం : కీరవాణి(keeravANi)
గానం : ఎస్.పి.బాలు, చిత్ర(S.P.bAlu,chitra)

పల్లవి :
అభ్రపథమ్మున విభ్రమ విలసిత
శుభ్రకౌముదీ దీపికా...
దుగ్ధాంభోనిధి జనిత లలిత
సౌందర్య ముగ్ధశ్రీ నాయికా...
చెమ్మచెక్క చెమ్మచెక్క
చారెడేసి మొగ్గా ఎర్రబడ్డ కుర్రబుగ్గ
ముద్దుపేరు సిగ్గా
లేత పెదవులే పగడ కాంతులు బొట్టు ఎరుపులే పొద్దు పొడుపులు
రామచిలక ముక్కుపుడక రమణిపాప... ఓఓఓ... //చెమ్మచెక్క//
చరణం : 1 తారలెన్ని ఉన్నా
ఈ తళుకే నిజం చలనచిత్ర మేమో
నీ చక్కని చక్కెర శిల్పం
మనసు తెలుసుకుంటే
అది మంత్రాలయం
కనులు కలుపుకుంటే
అది కౌగిలికందని ప్రణయం
ముందు నువ్వు పుట్టి తరువాత
సొగసుపట్టి పరువానికి పరువైన
యువతీ
వయసు కన్నుకొట్టి నా మనసు వెన్నుతట్టి మనసిచ్చిన మరుమల్లెకు
మరిదీ
దోరసిగ్గు తోరణాల తలుపుతీసి... ఓఓఓ... //చెమ్మచెక్క//
చరణం : 2 చిలిపి మనసు ఆడే
ఒక శివతాండవం పులకరింత కాదు
అది పున్నమి వెన్నెల కెరటం
పెదవి చాటు కవిత
మన ప్రేమాయణం
వలపు ముసురు పడితే
పురివిప్పిన నెమలిపింఛం
అందమారబెట్టే అద్దాల చీరకట్టే
తడియారిన బిడియాల తరుణీ
మనసు బైటపెట్టే
మౌనాలు మూటకట్టే
మగసిరిగల దొరతనమెవరిదనీ
గట్టుకాడ బొంగరాలు
ఆడనేల.. ఓఓఓ... //చెమ్మచెక్క//

External Link: chemma chekka chemma chekka

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |