hE udayinchina - హే ఉదయించిన
చిత్రం : కలుసుకోవాలని(kalusukOvAlani) (2002),రచన , సంగీతం, గానం : దేవిశ్రీ ప్రసాద్(dEviSrI prAsAd)
పల్లవి :
హే... ఉదయించిన సూర్యుడినడిగా
కనిపించని దేవుడినడిగా
నా గుండెలో నీ గుడినడిగా
నువ్వెక్కడనీ
చలి పెంచిన చీకటినడిగా
చిగురించిన చంద్రుడినడిగా
విరబూసిన వెన్నెలనడిగా
నువ్వెక్కడనీ
చెప్పవే... హే ఓ చెలీ నువ్వెక్కడే నా జాబిలి
ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న
కబురు తెలుసులే
వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసే నీ చెక్కిలి
ఇప్పుడూ ఎప్పుడూ నే మరువలేని
తీపి గురుతులే
ధీం తకిటతక్ తక్ తకిటతక్
తధీం తకిటతక్
తాంకిటతక తరికిటతక తరికిటతక॥తకిటతక్॥
చరణం : 1
మనసు అంతా నీ రూపం
నా ప్రాణమంతా నీకోసం
నువ్వెక్కడెక్కడని వెతికి వయసు
అలిసిపోయే పాపం
నీ జాడ తెలిసిన నిమిషం అహ అంతులేని సంతోషం
ఈ లోకమంతా నా సొంతం ఇది
నీ ప్రేమ ఇంద్రజాలం
అడుగు అడుగున నువ్వే నువ్వే
నన్ను తాకెనే నీ చిరునవ్వే
కలల నుండి ఓ నిజమై రావే నన్ను చేరవే
హోయ్ ప్రేమ పాటకు పల్లవి నువ్వే
గుండెచప్పుడుకి తాళం నువ్వే
ఎదను మీటు సుస్వరమై రావే
నన్ను చేరవే
హే... ఉదయించిన సూర్యుడినడిగా
కనిపించని దేవుడినడిగా
నా గుండెలో నీ గుడినడిగా
నువ్వెక్కడనీ
చరణం : 2
నువ్వు లేక చిరుగాలి
నావైపు రాను అంటోంది
నువ్వు లేక వెన్నెల కూడా ఎండల్లే
మండుతోంది
కాస్త దూరమే కాదా
మన మధ్యనొచ్చి వాలింది
దూరాన్ని తరిమివేసే గడియ
మన దరికి చేరుకుంది
ఏమి మాయవో ఏమో గానీ
నువ్వు మాత్రమే నా ప్రాణమనీ
నువ్వు ఉన్నా నా మనసంటుందే
నిన్ను రమ్మని
హాయ్ నువ్వు ఎక్కడున్నావో గానీ
నన్ను కాస్త నీ చెంతకు రానీ
నువ్వు లేక నేనే లేను అని నీకు తెలుపనీ
హే... ఉదయించిన సూర్యుడినడిగా
కనిపించని దేవుడినడిగా
నా గుండెలో నీ గుడినడిగా
నువ్వెక్కడనీ
hE udayinchina sooryuDinaDiga kanipinchani devuDinaDiga
naa gunDelo nee guDi naDiga nuvvekkaDaa ani
chali penchina cheekaTi naDiga
chigurinchina chandruDinaDiga
viraboosina vennela naDiga nuvvekkaDa ani
chikkavE O cheli nuvvekkaDE naa jaabili
ikkaDe ekkaDO unnaavu anna kaburu telusulE
vecchani nee kougili chitraalu chEsE nee chekkili
ippuDuu yeppuDu nE maruva lEni teepi gurutulE
manasu anta nee roopam na praaNamanta neekOsam
nuvvekkaDa ekkaDa ani vetiki vayasu alasipOye paapam
nee jaaDa telisEnannu nimisham aha antulEni santOsham
ee lOkamanta naa sontam idi nee prEma indrajaalam
aDugu aDuguna nuvvE nuvvE nannu taakEnE nee chirunavvE
kaLalaa nunDi O nijamai raave nannu chEraave
hOy prEma paaTaku pallavi nuvve gunDe chappuDiki taLam nuvvE
yedanu meeTu suswaramai raave nannu chErave
nuvvu lEka chirugaali naa vaipu raanu anTondi
nuvvu lEka vennela kooDa yenDalle manDutondi
kaasta dooramE kaada mana madhyanocchi vaalindi
dooraanni tarimi vEsE gaDiya mana dariki chErukondi
yEmi mayavo emO gaani nuvvu maatramE naa praaNamani
nuvvu unna naa manasanTundi ninnu rammani
hOy nuvu ekkaDunaavO gaani nannu kaasta nee chentaku raani
nuvvu lEkanE lEnElEnani kaasta telupani