nEnA nIvE nEnA - నేనా నీవే నేనా
చిత్రం : అనగనగా ఓ అమ్మాయి(anaganagA O ammAyi) (1999)రచన : వేటూరి(vETUri)
సంగీతం : మణిశర్మ(maNiSarma)
గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్. చిత్ర
పల్లవి :
నేనా నీవే నేనా...
నేనే నీలో లేనా...
నవ్వుతూ నాలో జల్లే పూలేవాన
యవ్వనాలెగసేవేళ రావే మైనా
నేనా నీవే నేనా...
నేనే నీలో లేనా...
చరణం : 1
వయ్యారాల మేన
సొగసుయ్యాలలూగుదానా
జాలువారు జుంటి తేనె జంట కోరి
పొరలి పొంగగా
సౌందర్యాల సోల
నను సోకే చూపులోనా
ప్రాణమల్లె జీవితాన ప్రాయమంతా
వెల్లి విరియగా
పచ్చగిల్లు నీ పాదాలే
పారాణి లేక నేనా
వెచ్చగిల్లు నీ ఒళ్లోనా
వేసంగి జల్లు కానా॥
చరణం : 2
సాయంకాలాలలో
నీ సాయం కోరుకోనా
ఎంకి పాట మీద ఆన
నిన్ను చేరి నీడనివ్వనా
పూలే ఇచ్చుకోనా
విరబూసే ఈడు దానా
అందమంతా హారతైనా
శ్రీమతల్లే వచ్చి నిలవనా
నీ కాలి మువ్వనే కాలేనా
పెనుగాలి దివ్వెనైనా
రాగమైనా ఈ బంధానా
నే పల్లవించిపోనా॥