చిత్రం : శాంతినివాసం(Santi nivasam) (1960)
రచన : సముద్రాల జూనియర్(samudrala jurnior)
సంగీతం : ఘంటసాల(ghanTasAla)
గానం : ఘంటసాల, పి.సుశీల
02 May - నేడు దేవిక వర్ధంతి
పల్లవి : రాగాలా సరాగాలా
హాసాలా విలాసాలా
సాగే సంసారం హాయ్
సుఖజీవనసారం॥
చరణం : 1
పతి పదసేవయే
యోగముగా
నాతికి పతియే
దైవముగా ॥
సతి సౌభాగ్యాలే
తన భాగ్యమనే
భావనయే పతి ధర్మముగ॥సౌభాగ్యాలే॥॥
చరణం : 2
మాయని ప్రేమల
కాపురమే
మహిలో వెలసిన
స్వర్గముగా॥
జతబాయని కూరిమి
జంటగ మెలిగే
దంపతులే
ఇల ధన్యులుగా॥॥
Special Note:
దేవిక అసలు పేరు ప్రమీలాదేవి. ఈమె చిత్తూరు జిల్లా, చంద్రగిరిలో
జన్మించారు. రంగస్థలనటిగా జీవితాన్ని ప్రారంభించిన దేవిక ఎస్.వి.సహస్రనామం
బృందం ప్రదర్శించిన అనేక నాటకాలలో వివిధ పాత్రలలో పోషించారు. తెలుగులో
ఎన్‌టిఆర్ సరసన హీరోయిన్‌గా ‘రేచుక్క (1954)’ సినిమాతో తెరంగేట్రం చేశారు.
తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలో దాదాపు 150 చిత్రాలకు పైగా నటించారు.
తెలుగులో ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామిచరిత్ర (1984)’ ఆమె నటించిన
ఆఖరి చిత్రం. తెలుగు చలనచిత్ర పితామహుడైన ‘రఘుపతి వెంకయ్యనాయుడు’కి దేవిక
సమీప బంధువు. ఈమె కుమార్తె కనక తెలుగు, తమిళ చిత్రాలలో నటించారు. దేవిక
2002, మే 2న తీవ్ర అస్వస్థతతో మద్రాస్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో
మరణించారు.