bhaga bhaga maNDE - భగభగ మండే
చిత్రం : మున్నా(munnA) (2007)రచన : కందికొండ
సంగీతం : హారిస్ జయరాజ్
గానం : శంకర్ మహదేవన్
పల్లవి :
భగభగ మండే
ఆ సూర్యుడు నేలకు నేరుగా
అతిథిగ వచ్చే
ఓ నిప్పుల వర్షం తీరుగా
చెమటలు పుట్టే
ఆ మంచుకు సైతం జోరుగా
మెరుపుగ చేరే చీకట్లో కిరణంలాగా
హే... ఒకడొచ్చేశాడే వీడే
ఓ పిడుగైనాడే
నేడే పిడికిల్లో సర్వం బంధిచేసేస్తాడే
హే... సమరానికి కూడా వీడే
సై సయ్యన్నాడే నేడే
ఎదురెళ్లి తాడోపేడో తేల్చేస్తాడే॥
చరణం : 1
వీడే వీడే హోరుగాలై వీచే...
లేచే లేచే లేచి ఉప్పెనల్లే మారే
ఉంటే ఉంటే తప్పు ఉండే ఉంటే
ఎత్తిచూపి సరిచేసి తీరుతాడే
బాధల్లోనే అండై ఉండి
ఆశే నింపి సాగిస్తాడే
ఓడావంటే ధైర్యానిచ్చి
దారే నీకే చూపిస్తాడే॥
చరణం : 2
లేదే లేదే హద్దు లేనే లేదే...
చూడే తానే ఒక్క యోధుడల్లే మారే
దూసే దూసే చురకత్తే దూసే
దమ్మే చూపి ఇక దుమ్ము లేపుతాడే
కష్టాలుంటే తోడుంటాడే
కన్నీరొస్తే తుడిచేస్తాడే
ప్రేమే పంచి ప్రేమిస్తాడే
నీడై తానే లాలిస్తాడే॥
Extra songs:
Chamakkuro munna
Munna Vasthava Vasthava
ManasA nuvvuNDE
Konchem Konchem
Kadhulu Kadhulu | 1 |