Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

E gunlANTi kannulunna - ఏ గన్నులాంటి కన్నులున్న

చిత్రం : గబ్బర్‌సింగ్(gabbar singh) (2012)
రచన, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : పవన్ కళ్యాణ్, వడ్డేపల్లి శ్రీనివాస్


సాకీ :
ఏ పిల్లా అట్లా నవ్వేసేసి పారిపోమాకే బాబు...
మీరేంట్రా నన్ను చూస్తున్నారు
ఎవడి డప్పు వాడు కొట్టండెహ... అది... ఓయ్
పల్లవి :
ఏ గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్లా
ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతేయెల్లా॥గన్నులాంటి॥
ఏ సుందరి సుందరి సుందరి
మనసుని చేసినావే ఇస్తిరీ
స్ట్రాబెర్రీ బ్లూ బెర్రీ బ్లాక్ బెర్రీ మిక్స్ చేసి
లిప్పులో పెట్టినావే ఫ్రెంచ్ జ్యూసు ఫ్యాక్టరీ
పిల్లా నువ్వు లేని జీవితం
నల్లరంగు అంటుకున్న తెల్ల కాగితం
అహ పిల్లా నువ్వు లేని జీవితం
ఆవకాయ బద్దలేని మందు కంటే దారుణం॥గన్నులాంటి॥
చరణం : 1
పంచదార పెట్టి రుద్దినట్టు
మంచి తేనె తెచ్చి అద్దినట్టు
దాక్షపండు తీసి పిండినట్టు
ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు చుట్టు
వెయ్యి ముగ్గు సుక్కలెట్టినట్టు... విన్నాంలే
పొయ్యిమీద పాటు పొంగినట్టు.. విన్నాంలే
పూటకొక్క పండగొచ్చినట్టు
ఏదేదో అవుతోందే నీ మీద ఒట్టు
సంపకే సంపకే సంపకే
నిప్పులాంటి నవ్వులోకి దింపకే
ఏ సింపకే సింపకే సింపకే
నల్లని రాత్రిని సింపకే రంగుతో నింపకే
పిల్లా నువ్వులేని జీవితం
బ్రేకు లేని బైక్ నే రయ్యమంటు తోలడం
హే... పిల్లా నువ్వు లేని జీవితం
ట్రాకు లేని ట్రైన్ మీద కుయ్యమంటు యెల్లడం
చరణం : 2
ఒక్క జానడంత కప్పుకోసం...
పెద్ద వరల్ట్ కప్పు జరుగుతాది
నీ నవ్వులున్న లిప్పుకోసం...
చిన్న వరల్ట్ వారు జరిగినా తప్పులేదే
కొన్ని వేల కోట్ల అప్పుకోసం...
కాపు కాసి ఉన్నదంట దేశం
ఒక్క నవ్వునంట ఇవ్వు పాపం
దాన్ని అమ్ముకుంటే అప్పు బాధ తప్పుతాదే
కొట్టినా కొట్టినా కొట్టినా
గుండెలోన దాగివున్న డప్పుని
రాసినా రాసినా రాసినా
నవ్వుపై ఎవ్వరూ రాయని మస్తు మస్తు పాటని
పిల్లా నువ్వు లేని జీవితం
తాడు లేని బొంగరాన్ని గిర్రుమంటు తిప్పడం
హేయ్ పిల్లా నువ్వు లేని జీవితం
నూనెలోంచి వానలోకి జారిపడ్డ అప్పడం

External Link:
Gabbar Singh Full Video Songs
Gabbar Singh Full Audio Songs

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |