Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

manasupaDi manasupaDi - మనసుపడి మనసుపడి

చిత్రం : ప్రేమికులరోజు(prEmikularOju) (1999)
రచన : ఎ.ఎం.రత్నం, శివగణేష్
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : శ్రీకుమార్, శ్రీనివాస్, బృందం



పల్లవి : మనసుపడి మనసుపడి మన్మథుడె మనసుపడి (2)
నీకోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే (2)
మనసుపడి మనసుపడి మరుమల్లె మనసుపడి
నీకోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే (2)
నా గుండెలే ఆటస్థలముగా ఎగిరెగిరి ఆటలు ఆడిన
చిన్నారివి నీవే తల్లి
కళ్యాణవేళ ముస్తాబయ్యి పెళ్లికొడుకుతో ముచ్చటలాడి
ఆనందమే జీవితమంటూ సాగు
గోరింటతో ముగ్గులు పెట్టి
మణికట్టుకి గాజులు తొడిగి
ఈ రోజా చేతికి
రోజా పువ్వందించు॥
నీ వరుడు రేపు వేంచేస్తాడు
తన ప్రేమ నీకు పంచిస్తాడు
నీ పెళ్లి వేదికను నే వెయ్య
ఆ వరుడు చేయి నీ కందియ్య
నీ తండ్రి మది ఉయ్యాలలూగ
చరణం : 1 ఆ... మనసులోని ప్రేమ నీకు చెప్పలేదు
చెప్పబోవునంతలో నా పెదవి మెదల లేదు॥
ఆదుకున్న దైవం ఆశ తీర్చ నేను
ఆశీస్సులు అందిస్తున్నా కంటనీరుతోను
నా కనులనిండుగా నీరూపం
నిను తలచుకొన డమే నా ధ్యేయం (2)
నీ ఆనందమే నా సంతోషం నా ప్రేమే ధన్యం
కలకాలం వర్ధిల్లు... వర్ధిల్లు కలకాలం...॥
చరణం : 2 కలువ కళ్లకేమో కాటుకను తీర్చి
కారుమబ్బు కురులలోన మొగలిపూలు పేర్చి॥
విలువ కట్టలేని మణులు ఎన్నో దాల్చి
హంసలాగ వేదికకొచ్చె
చంద్రబింబ వదనం
మేళతాళం మ్రోగగా వధువునకు
తాళిబొట్టు కట్టెలే పెళ్లికొడుకు॥
ఈ పేద హృదయమే
దీవించ పూలజల్లే కురియు
వర్ధిల్లు కలకాలం... ॥
For Remaining Songs:

Vaalu Kannuladaana | HD |
Dhaandiya
Roja Roja | HD |
Prema Ane - Kunal - Sonali Bendre
Oh Maria Oh Maria | HD |

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |