Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

mAvA mAvA mAvA - మావా మావా మావా

చిత్రం : మంచిమనసులు (ma~nchi manasulu) (1962)
రచన : కొసరాజు
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఘంటసాల, జమునారాణి, బృందం
23 June - నేడు కొసరాజు జయంతి


పల్లవి :
మావా మావా మావా... (2)
ఏమే ఏమే భామా... (2)
పట్టుకుంటే కందిపోవు
పండు వంటి చిన్నదుంటే
చుట్టు చుట్టుతిరుగుతారు మర్యాదా?॥
తాళి కట్టకుండ ముట్టుకుంటే తప్పుకాదా?
మావా మావా మావా... (2)
వాలువాలు చూపులతో
గాలమేసి లాగిలాగి
ప్రేమలోకి దింపువాళ్లు మీరు కాదా?॥
చెయ్యి వెయ్యబోతే
బెదురుతారు వింతగాదా?
ఏమే ఏమే భామా... (2)
చరణం : 1
నీవాళ్లు నావాళ్లు రాకనే
మనకు నెత్తిమీద అక్షింతలు పడకనే (2)
సిగ్గు దాచి... ఓహో...
సిగ్గు దాచి ఒకరొకరు
సిగను పూలు కట్టుకొని
టింగు రంగయంటు ఊరు తిరుగొచ్చునా
లోకం తెలుసుకోక
మగవాళ్లు మెలగొచ్చునా
మావా మావా మావా... (2)
హోయ్ హోయ్ హోయ్... (2)
చరణం : 2
కళ్లు కళ్లు కలుసుకోని రాకముందే
అహ కప్పుకున్న సిగ్గు జారిపోకముందే॥
మాయజేసి ఒహో
మరులుగొల్పి ఒహో...
మాయజేసి మరులుగొల్పి మాటగల్పి
మధురమైన మా మనసు దోచవచ్చునా?
నీవు మర్మమెరిగి ఈమాట అడగవచ్చునా
ఏమే ఏమే భామా... (2)
చరణం : 3
పడుచుపిల్ల క ంటపడితే వెంటబడుదురు
అబ్బో వలపంతా ఒలకబోసి
ఆశ పెడుదురు॥
పువ్వు మీద... ఒహో...
పువ్వు మీద వాలు పోతు తేనెటీగ వంటి
మగవాళ్ల జిత్తులన్నీ తెలుసులేవయ్యా
మా పుట్టి ముంచు కథలన్నీ విన్నామయ్యా
మావా మావా మావా... (2)
హోయ్ హోయ్ హోయ్... (2)
చరణం : 4
కొత్త కొత్త మోజుల్ని కోరువారు
రోజు చిత్రంగా వేషాలు మార్చువారూ॥
టక్కరోళ్లుంటారు టక్కులు జేస్తుంటారు
నీవు చెప్పు మాట కూడ నిజమేనులే
స్నేహం దూరంగా ఉన్నపుడే జోరవునులే
అవునే అవునే భామా... (2)
కట్టుబాటు ఉండాలి గౌరవంగా బ్రతకాలి
ఆత్రపడక కొంతకాలమాగుదామయా॥
ఫెళ్లున పెళ్లైతే ఇద్దరికీ అడ్డులేదయ్యా
మావా మావా మావా... (2)

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |