Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

kalusukunnA gubulAye - కలుసుకున్నా గుబులాయె

చిత్రం : అక్బర్ సలీం అనార్కలి(akbar salIm anArkali) (1978)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : సి.రామచంద్ర
గానం : మహ్మద్ రఫీ, పి.సుశీల
31 July - నేడు మహ్మద్ రఫీ వర్ధంతి


పల్లవి :
కలుసుకున్నా గుబులాయె
కలవకున్న దిగులాయె
ఏమాయె నాలో ఏమాయె...॥
కలుసుకుంటే క్షణమాయె
కలవకుంటే యుగమాయె
ఏమాయె నాలో ఏమాయె
చరణం : 1
మన్నించు షహజాదా మనసిచ్చె నిరుపేద (2)
గులాబీపువ్వు ఎక్కడ దానిమ్మమొగ్గ ఎక్కడ గులాబీపువ్వు ఎక్కడ దానిమ్మమొగ్గ ఎక్కడ
గులాబీ ఐనా అనారైనా మొలిచేది నేలపైన
ఆ... నేలలాంటిదే ప్రేమ (2)
దానికి అంతరాలే లేవు సుమా... లేవు సుమా॥
చరణం : 2
తులదూచలేనిది విలువైన మీ ప్రణయం (2)
బానిసను ప్రేయసిగా వలచింది మీ హృదయం బానిసను ప్రేయసిగా వలచింది మీ హృదయం
జమానా కాదని అంటున్నా
హుకూమత్ కత్తులు దూస్తున్నా (2)
నా... మదినేలే దొరసానివి (2)
ఇక భరతావనికే రాణివి... మహారాణివి॥
చరణం : 3
పొద్దును పొంగే కడలిని నిలదీసేదెవరు
వలచిన జంటలు కలిసిన ఆత్మల
విడదీసేదెవరు
అనార్ సలీముల ప్రేమగాథ
అమరగాథయేలే అమరగాథయేలే
అమరగాథయేలే...

External Link:
kalusukunnA gubulAye Audio

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |