Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

E SwAsalO chEritE - ఏ శ్వాసలో చేరితే

చిత్రం : నేనున్నాను (nEnunnAnu) (2004), రచన : సిరివెన్నెల
సంగీతం : ఎం.ఎం.కీరవాణి, గానం : కె.ఎస్.చిత్


పల్లవి :
వేణుమాధవా... ఆ... (2)
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో
ఏ మోవిపై వాలితే మౌనమేమంత్రమౌతున్నదో
ఆ శ్వాసలో నే లీనమై ఆ మోవిపై నే మౌనమై
నిను చేరనీ మాధవా... ఆ...॥శ్వాసలో॥
చరణం : 1
మునులకు తెలియని జపములు జరిపినదా...
మురళీ సఖి వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా
తనువున నిలువున తొలిచిన గాయమునే
తన జన్మకి
తరగని వరముల సిరులని తలచినదా
కృష్ణా నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది
ఎలా ఇంత పెన్నిధి వెదురు తాను పొందింది
వేణుమాధవా నీ సన్నిధి...॥శ్వాసలో॥
చరణం : 2
చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకి
నలువైపుల నడిరాతిరి ఎదురవదా
అల్లన నీ అడుగుల సడి వినబడక
హృదయానికి అలజడితో అణువణువు
తడబడదా... ఆ... ఆ...
నువ్వే నడుపు పాదమిది నువ్వే మీటు నాదమిది
నివాళిగా నా మది
నివేదించు నిమిషమిది
వేణుమాధవా నీ సన్నిధి
గాగ రిగరి సరి గాగ
రీరి సరి
గపద సాస దప గరి సరీ
గగ దపదా గప దసదా
ద ప గ రి గ
దపద సాస దపద సాస
దపద రీరి దపద రీరి
దస రిగరి సరీ
గరిసరీ ద రి గారి సరిగా రిస దప
గగగ పాప గగగ దాద గగగ సాస
దప గప గస రిసరిసరి గరిస దసరీ గదప సగరీ
పగ పదసరీ సరి గపగరీ
సద పద పస దస పద పస దస
పదప రిసరి పదప రిసరి
పద సరి గరి సద
పదస గదస రిగస
సరిగప దసరిగా
ఆ... రాధికా హృదయ రాగాంజలి...
నీ పాదముల వ్రాలు కుసుమాంజలి... ఈ గీతాంజలి...

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |