gOvindA gOvindA - గోవిందా గోవిందా
చిత్రం : ఖడ్గం(khaDgam) (2002)రచన : చిర్రావూరి విజయ్‌కుమార్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, గానం : శ్రీ, దేవిశ్రీ
పల్లవి :
గోవిందా గోవిందా... గోవిందా గోవిందా...
నుదుటిరాతను మార్చేవాడా
ఉచితసేవలు చేసేవాడా
లంచమడగని ఓ మంచివాడా
లోకమంతా ఏలేవాడా
స్వార్థమంటూ లేనివాడా బాధలన్నీ తీర్చేవాడా
కోర్కెలే నెరవేర్చేవాడా నాకు నువ్వే తోడూనీడా
గోవిందా గోవిందా... గోవిందా గోవిందా...
అరె బాగుచెయ్ నను గోవిందా
బాగుచెయ్ నను గోవిందా
జూబ్లీహిల్స్‌లో బంగ్లా ఇవ్వు
లేనిచో హైటెక్‌సిటీ ఇవ్వు
హైజాకవ్వని ఫ్లైటొకటివ్వు
వెంటతిరిగే శాటిలైటివ్వు
పనికిరాని చవటలకిచ్చి
పరమ బేవార్స్‌గాళ్లకిచ్చి
నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి
కోట్లకధిపతి చెయ్‌రా మెచ్చి
గోవిందా గోవిందా... గోవిందా గోవిందా...
బాగుచెయ్ నను గోవిందా...
పైకి తే నను గోవిందా గోవిందా గోవిందా
అరె గోవిందా గోవిందా...
చరణం : 1
పెట్రోలడగ ని కారు ఇవ్వు
బిల్లు ఇవ్వని బారు ఇవ్వు
కోరినంత ఫుడ్డు పెట్టి
డబ్బులడగని హోటలు ఇవ్వు
అసెంబ్లీలో బ్రోకర్ పోస్టో
రాజ్యసభలో ఎంపీ సీటో
పట్టుపడని మ్యాచ్‌ఫిక్సింగ్
స్కాముల సంపాదనివ్వు
ఓటమెరుగని రేసులివ్వు లాసురాని షేరులివ్వు
సింగిల్ నంబర్ లాట్రీలివ్వు
ట్యాక్స్ అడగని ఆస్తులివ్వు ॥
గో గో గో గో... గోవిందా గోవిందా...
బాగుచెయ్ నను గోవిందా...
చరణం : 2
వందనోట్ల తోటలివ్వు గోల్డ్ నిధుల కోటలివ్వు
లేకపోతే వెయ్యిటన్నుల
కోహినూర్ డైమాండ్స్ ఇవ్వు
మాస్ హీరో ఛాన్సులివ్వు
హిట్టు సినిమా స్టోరీలివ్వు
స్లిమ్ముగున్న సొమ్ములున్న
హీరోయిన్నే వైఫుగా ఇవ్వు
హాలీవుడ్‌లో స్టూడియోనివ్వు
స్విస్సుబ్యాంక్‌లో బిలియన్లివ్వు
కోట్లుతెచ్చే కొడుకులనివ్వు
హీరోలయ్యే మనవలనివ్వు
నన్ను కూడా సీఎం చెయ్యి
లేకపోతే పీఎం చెయ్యి
తెలుగుతెరపై తిరుగులేని
తరిగిపోని లైఫునియ్యి॥
అరె పైకి తే నను గోవిందా...
గోవిందా గోవిందా...
లక్కుమార్చి నన్ను కరుణిస్తే
తిరుపతొస్తా త్వరగా చూస్తే
ఏడుకొండలు ఏసి చేస్తా
ఎయిత్ వండర్ నీ గుడి చేస్తా
గోవిందా గోవిందా... ఏడుకొండలు ఏసి చేస్తా
బాగుచెయ్ నను గోవిందా...
ఎయిత్ వండర్ నీ గుడి చేస్తా ॥
అయ్యబాబోయ్ దేవుడు
మాయమైపోయాడే ంటీ..?