hE mantrAlaya deepA - హే మంత్రాలయ దీపా
సాకీ :హే... మంత్రాలయ దీపా...
శ్రీరాఘవేంద్ర గురునాథా...
ప్రభో పాహిమాం...
శ్రీరాఘవేంద్ర గురునాథా (9)
పల్లవి :
నమ్మిన నా మది మంత్రాలయమేగా... ఓ...
న మ్మని వారికి తాపత్రయమేగా
శ్రీగురు బోధలు అమృతమయమేగా... ఓ...
చల్లని చూపులు సూర్యోదయమేగా
గురునాథ రాఘవేంద్ర శ్రీకృష్ణ పారిజాతా
హనుమంత శక్తిసాంద్రా
హరినామ గాన గీతా
నీ తుంగభద్ర మా పాపాలే కడగంగా
తుంగదళాల సేవ తులసీదళాల పూజ
అందుకో...
చరణం : 1
నిరాశ మూగేవేళా మా దురాశ రేగేవేళా
నీ భజనే మా బ్రతుకైపోనీవా
పదాలవాలే వేళ నీ పదాలు పాడే వేళ
నీ చరణం మా శరణం కానీవా
మనసు చల్లని హిమవంతా
భవము తీర్చరా భగవంతా
మహిని దాల్చిన మహిమంతా
మరల చూపుమా హనుమంతా
నీ వీణతీగలో యోగాలే పలుకంగా
తుంగదళాల సేవ తులసీదళాల పూజ
అందుకో... ॥
చరణం : 2
వినాశ కాలంలోన ధనాశపుడితేలోనా
నీ పిలుపే మా మరుపై పోతుంటే
వయస్సు పాడేవేళా వసంతమాడే వేళా
నీ తలపే మా తలుపే మూస్తుంటే
వెలుగు చూపరా గురునాథ
వెతలు తీర్చరా యతిరాజా
ఇహము బాపెనే హితబోధ
పరము చూపెనే ప్రియగాథ
నీ నామ గానమే ప్రాణాలై పలుకంగా
తుంగదళాల సేవ తులసీదళాల పూజ
అందుకో... ॥
చిత్రం : రాఘవేంద్ర (2003), రచన : వేటూరి
సంగీతం : మణిశర్మ, గానం : శ్రేయాఘోషల్, కల్పన