kaLakaLalu kilakilalu - కళకళలు కిలకిలలు
చిత్రం : తమ్ముడు(tammuDu) (1999)రచన : చంద్రబోస్
సంగీతం : రమణగోగుల
గానం : ఎస్.పి.బాలు, బృందం
పల్లవి :
కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు
ఎదురుగా నిలిచెను మా కన్నులకి
రాముడికి జానకికి పెళ్లి కుదిరినది
ఈ సందడికి విందులకి
ఇల్లు మురిసినది
గల గల కళకళలు కిలకిలలు॥
చరణం : 1
నమ్మలేని లోకం నుంచి
మహాలక్ష్మిలాగా
అమ్మలేని మా ఇంట్లోకి
వదినమ్మ రాకా
ఎన్నడైన తన వెనకాలే
ఉంటాను కనకా
అన్నగారు తననేమన్నా
ఊరుకోను ఇంకా
నా చిన్ని అల్లర్లన్నీ భరించాలి
అంతా ఓర్పుగా
చరణం : 2
మెట్టినింటి దీపం నీతో వెలగాలి మళ్లీ
కూతురంటి రూపం నీదే నా చిట్టితల్లి
ఆశలన్నీ అక్షింతలుగా జరగాలి పెళ్లి
అందమైన జంటను చూసి
మురవాలి తాళి
విడిది నేను ఇస్తానంటూ
తపించాలి నింగిన జాబిలి॥
Thammudu Song With Lyrics - Kalakalalu (Aditya Music)
Watch remaining Songs With Lyrics:
"Made in Andhra student " (Lyrics: Chandra Bose; Singer: Ramana Gogula)
"Vayyari Bhama" (Lyrics: Sirivennela Sitaramasastri; Singer: Ramana Gogula)
"Edola vundi" (Lyrics: Surendra Krishna; Singer: Ramana Gogula)
"Pedavi datani matokati undi " (Lyrics: Sirivennela Sitaramasastri; Singers: Ramana Gogula, Sunitha)
"Travelling soldier" (Lyrics: Ramana Gogula; Singer:Ramana Gogula)
"College blues" (Lyrics: Ramana Gogula; Singer: Ramana Gogula)
"Kala kala ku Kila kila lu" (Lyrics: Chandra Bose; Singer: S.P. Balu)