Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

nEDu SrIvAriki mEmaNTE - నేడు శ్రీవారికి మేమంటే

చిత్రం : ఇల్లరికం(Illarikam) (1959)
రచన : ఆరుద్ర, సంగీతం : టి.చలపతిరావు
గానం : ఘంటసాల, పి.సుశీల

30 August - నేడు జమున పుట్టినరోజు
(Jamuna Birth Day)



పల్లవి :
నేడు శ్రీవారికి మేమంటే పరాకా... ఆ...
తగని బలే చిరాకా...
ఎందుకో తగని బలే చిరాకా... ఆ...
నేడు శ్రీవారికి మేమంటే పరాకా
చరణం : 1
మొదట మగవారు వేస్తారు వేషాలు
పెళ్లి కాగానే చేస్తారు మోసం
ఆ... ఆడవారంటే శాంత స్వరూపాలే
కోపతాపాలు రావండి పాపం
కోరి చేరిన మనసు చేత చిక్కిన అలుసు (2)
కొసకు ఎడబాటు అలవాటు చేస్తారు
నేడు శ్రీమతికి మాతోటి వివాదం
తగువే బలే వినోదం...
ఎందుకో తగువే బలే వినోదం... ఊ...
నేడు శ్రీమతికి మాతోటి వివాదం
చరణం : 2
వారి మనసైతే వస్తారు ఆడవారు
చేర రమ్మంటే రానేరారు
ఆ... తెలుసుకున్నారు స్త్రీల స్వభావాలు
తెలిసి తీర్చారు ముద్దు మురిపాలు
అలుక సరదా మీకు అదే వేడుక మాకు (2)
కడకు మురిపించి గెలిచేది మీరేలే...
ప్రణయ కలహాల సరసాలే వినోదం
నిజమే బలే వినోదం...
ఆ... నిజమే బలే వినోదం (2)

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |