oka manasutO - ఒక మనసుతో
చిత్రం : ఈ అబ్బాయి చాలా మంచోడు (Ee Abbai ChAla ManchODu) (2003)రచన : చంద్రబోస్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : ఎం.ఎం.కీరవాణి, గంగ
పల్లవి :
ముడి ఎట్టావేస్తావూ
ఆ ముడి ఒక కొంగుముడయ్యేదాకా
ఊరుకోవూ ప్రేమా... ఆ...॥మనసుతో॥
చరణం : 1
పసిపాపలో ముసినవ్వులా
కపటాలు లేని ప్రేమా
మునిమాపులో మరుమల్లెలా
మలినాలు లేని ప్రేమా
అరచేతిలో నెలవంకలా
తెరచాలుటోని ప్రేమా
నదిగొంతులో అలపాటలా
తడబాటులేని ప్రేమా
మనసుల కలివిడి ఫలితం ప్రేమ...
తనువుల తాకిడి కాదు సుమా
అనంత జీవయాత్రలోను
తోడు ప్రేమా...
ప్రేమా... ఆ... ॥మనసుతో॥
చరణం : 2
అధరాలలో తడి మెరుపులా
మెరిసేది కాదు ప్రేమా
హృదయాలలో ధృవతారలా
అలరారుతుంది ప్రేమా
పరువాలతో కరచాలనం
చేసేది కాదు ప్రేమా
ప్రాణాలలో స్థిరబంధనం
నెలకొల్పుతుంది ప్రేమా
మమతల అమృతవర్షిణి ప్రేమ
కోర్కెల అలజడి కాదు సుమా
నిశీధిలోనూ వీడిపోని నీడ ప్రేమా
ప్రేమా... ఆ ఆ ఆ ఆ ఆ...॥మనసుతో॥
E Abbayi Chala Manchodu - Oka Manasutho - Love Song
Listen Audio Songs:
Ee Abbai ChAla ManchODu | 1 |
