Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

vEsamkAlam vennEllAga - వేసంకాలం వెన్నెల్లాగ

చిత్రం : నేనున్నాను(nEnunnAnu) (2004)
రచన : సిరివెన్నెల, సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : కె.కె., శ్రేయాఘోషల్

29 August - నేడు నాగార్జున బర్త్‌డే
(nAgArjuna Birth Day)



పల్లవి : వేసంకాలం వెన్నెల్లాగ
వానల్లో వాగుల్లాగ వయసు ఎవరికోసం
తోం ధిరి... తోం ధిరి... తోం ధిరి ధిరి ధిరి ధిరి
ధిరి తోం ధిరి
శీతాకాలం ఎండల్లాగ సంక్రాంతి పండుగలాగ
సొగసు ఎవరికోసం
తోం ధిరి... తోం ధిరి... తోం ధిరి ధిరి ధిరి ధిరి
ధిరి తోం ధిరి

ఓరోరి అందగాడా నన్నేలు మన్మథుడా...
నీకోసం నీకోసం... నీకోసం... (2)
నీ సిగ్గుల వాకిట్లో నా ముద్దుల ముగ్గేసి
నే పండగ చేసి సందడివేళ ఆకూ వక్క సున్నం
నీకోసం... నీకోసం... నీకోసం... (2)

చరణం : 1 గుండె చాటుగా ఉండనందిక
ఇన్నినాళ్లు దాచుకున్న కోరిక
ఉన్నపాటుగా ఆడపుట్టుక
కట్టుబాటు దాటలేదుగా
కన్నెవేడుక విన్నవించగా
అందుబాటులోనే ఉన్నానుగా
తీగచాటుగా మూగపాటగా
ఆగిపోకే రాగమాలిక
నిలువెల్ల నీ జతలోన చిగురించు లతనై రానా
కొనగోటి కొంటెతనాన నిను మీటనా చెలివీణ
అమ్మమ్మో అబ్బబ్బో ఆ ముచ్చట తీరంగా
నీ మెళ్లో హారంగా
నా రేకులు విచ్చే సోకులు తె చ్చి
అందిస్తున్నా మొత్తం
నీకోసం... నీకోసం... నీకోసం... (2)

చరణం : 2 సిగ్గు పోరిక నెగ్గలేవుగా
ఏడుమల్లెలెత్తు సుకుమారమా
సాయమీయక మోయలేవుగా
లేత సోయగాల భారమా
కౌగిలింతగా స్వాగతించగా
కోరుకున్న కొంగు బంగారమా
తాళిబొట్టుగా కాలిమెట్టెగా
చేరుకోవా ప్రేమ తీరమా
మునిపంటి ముద్దర కానా
చిగురంటి పెదవుల పైన
మురిపాల మువ్వను కానా
దొరగారి నవ్వులలోనhttp://www.blogger.com/img/blank.gif
నిద్దర్లో పొద్దుల్లో నీ వద్దకు నేనొచ్చి
ఆ హద్దులు దాటించి
నువ్వొద్దనలేని పద్ధతిలోని ముద్దులెన్నో తెచ్చా
నీకోసం... నీకోసం... నీకోసం... (2)//వేసంకాలం//


External Link:
NEnunnAnu Audio Songs | 1 |

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |