Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

viNTunnAvA viNTunnAvA - వింటున్నావా వింటున్నావా

చిత్రం : ఏమాయ చేసావె(yE mAya chEsAve) (2010)
రచన : అనంత శ్రీరామ్
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : కార్తీక్, శ్రేయాఘోషల్, బృందం


సాకీ :
పలుకులు నీ పేరే తలచుకున్నా
పెదవుల అంచుల్లో అనుచుకున్నా
మౌనముతో నీ మదిని బంధించా
మన్నించు ప్రియా...
పల్లవి :
తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా
//తరిమే//
విన్నా వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు
నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా
తొలిసారి నీ మాటల్లో
పులకింతలా పదనిసలు విన్నా
చాలు చాలే చెలియా చెలియా
బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా
ఓ... బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా
చరణం : 1
ఏమో ఏమో ఏమవుతుందో
ఏదేమైనా నువ్వే చూసుకో
విడువను నిన్నే ఇకపైనా వింటున్నావా... ప్రియా
గాలిలో తెల్ల కాగితంలా నేనలా తేలి ఆడుతుంటే
నన్నే ఆపీ నువ్వే రాసినా ఆ పాటలనే వింటున్నా
//తరిమే//
ఆద్యంతం ఏదో ఏదో అనుభూతి
ఆద్యంతం ఏదో అనుభూతి
అనవరగం ఇలా అందించేది
గగనం కన్నా మునుపటిది
భూతలం కన్నా ఇది వెనుకటిది
కాలంతోనా పుట్టింది
కాలంలా మారే మనస్సే లేనిది ప్రేమ
చరణం : 2
రా ఇలా కౌగిళ్లలో నిన్ను దాచుకుంటా
నీదానినై నిన్నే దారి చేసుకుంటా
ఎవరినీ కలువని చోటులలోన
ఎవరినీ తలువని వేళలలోన
//తరిమే//

Eega Herione samantha Ye Maya Chesave Songs - Vintunnavaa - Naga Chaitanya, Samantha


0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |