Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

A A A navarasa sumamAlika - ఆ ఆ ఆ నవరస సుమమాలిక

చిత్రం : మేఘసందేశం(mEgha sandESam) (1982)
రచన : వేటూరి, సంగీతం : రమేష్‌నాయుడు
గానం : కె.జె.ఏసుదాస్

01 September - నేడు రమేష్‌నాయుడు వర్ధంతి
పల్లవి :
ఆ ఆ ఆ... నవరస సుమమాలిక
నా జీవనాధార నవరాగమాలిక
నవరస సుమమాలిక
సని సరి గరి సరి మపని పనిస గరి
గరీ సనిద దనీ దపమ గరి నిసగ
నవరస సుమమాలిక
సగమ గమప గమ గప మగ సగ సని
పనిసగ సగమ గమప నిని పమప
త్యాగయ్య క్షేత్రయ్య అన్నమయ్య
తెలుగింటిలోన వెలిగించిన (2)
నాద సుధామయ రసదీపిక
నవరస సుమమాలిక
చరణం : 1
అందాలు అలలైన మందాకిని
మందార మకరంద రసవాహిని
ఆమె చరణాలు అరుణ కిరణాలు
ఆమె నయనాలు నీల గగనాలు
ఆ జవ్వనాలు నా జన్మకు దొరికిన
నైరుతి ఋతుపవనాలు
ఆ చిరునవ్వు లేత నెలవంక...
ఆ చిరునవ్వు లేత నెలవంక
దిగివచ్చెనేమో ఇలవంక ॥
చరణం : 2
శృంగార రసరాజ కల్లోలిని
కార్తీక పూర్ణేందు కల్హారిణి
ఆమె అధరాలు ప్రణయ మధురాలు
ఆమె చలనాలు శిల్ప గమనాలు
ఆ దర్శనాలు నా జన్మకు మిగిలిన
సుందర సుఖ తరుణాలు
ఆ కనుచూపు నాకు కడదాక...
ఆ కనుచూపు నాకు కడదాక
పిలుపైనా లేని ప్రియలేఖ ॥

పూర్తి పేరు : పువ్వుల రమేష్ నాయుడు
జననం : 26-11-1931

జన్మస్థలం : కొండపల్లి, కృష్ణాజిల్లా

తల్లిదండ్రులు : సత్యవతి, నందయ్య

చదువు : ఎస్‌ఎస్‌ఎల్‌సి

భార్యలు : మొదటి భార్య మహారాష్ట్రియన్ రెండో భార్య పంజాబీ

సంతానం : నలుగురు కుమారులు

తొలిచిత్రం : హిందీలో హ్యామ్లెట్ (1954). తెలుగు లో స్వయంప్రభ (1957)

ఆఖరిచిత్రం : స్వయంకృషి (1987) - తెలుగు

చిత్రాలు : దాదాపు 200లకు పైగా (దాదాపు 12 భాషలలో)

గాయకునిగా : రాధమ్మపెళ్లి (1974)లో ‘అయ్యింది రాధమ్మ పెళ్లి’, చిలర్లకొట్టు చిట్టెమ్మ (1977)లో ‘గోదారికే ఆటుపోటు ఉందంటే తప్పుతుందా’, సంధ్యారాగం (1981)లో ‘చితికెక్కినవి రెండు జీవితాలు’ కొంగుముడి (1985)లో ‘రాదా మళ్లీ వసంతకాలం’, సత్యాగ్రహం (1987)లో ‘చిలకపాట...’

అవార్డులు : చిలర్లకొట్టు చిట్టెమ్మ (1977) సినిమాకి ఉత్తమ నేపథ్య గాయకుడిగా, మేఘసందేశం (1982), సువర్ణ సుందరి (1984) ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది అవార్డులు. మేఘసందేశం (19 82) సినిమాకి ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ అవార్డు అందుకున్నారు.

మరణం : 01-09-1988

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |