dEvuDanEvADunnADA - దేవుడనేవాడున్నాడా
చిత్రం : దాగుడుమూతలు(dAguDu mUtalu) (1964)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఘంటసాల, పి.సుశీల
13 September - నేడు ఆచార్య ఆత్రేయ వర్ధంతి
(AchArya AtrEya)
పల్లవి :
కలిగెను సందేహం (2)
మనుషులనే వారున్నారా అని
దేవునికొచ్చెను అనుమానం (2)॥
చరణం : 1
మనసులేని ఈ మనిషిని చూచి
దేవుడు రాయైపోయాడు
ఆ... దేవుడు కనపడలేదని
మనిషి నాస్తికుడైనాడు (2)॥
చరణం : 2
పశువులకన్నా పక్షులకన్నా మనిషిని
మిన్నగ చేశాడు (2)
బుద్ధిని ఇచ్చి హృదయాన్నిచ్చి
భూమే నీదని పంపాడు (2)
బుద్ధికి హృదయం లేక
హృదయానికి బుద్ధేరాక (2)
నరుడే ఈ నరలోకం నరకం చేశాడు॥
చరణం : 3
తాము నవ్వుతూ
నవ్విస్తారు కొందరు అందరినీ (2)
తామేడుస్తూ ఏడ్పించుతారెందరో
కొందరినీ (2)
నేను నవ్వితే ఈ లోకం
చూడలేక ఏడ్చింది
నేనేడిస్తే ఈ లోకం
చూసి చూసి నవ్వింది॥