Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

srIlakshmi peLliki - శ్రీలక్ష్మి పెళ్లికి

చిత్రం : జస్టిస్ చౌదరి(Justice Chowdary) (1982)
రచన : వేటూరి, సంగీతం : చక్రవర్తి
గానం : బాలు, సుశీల, శైలజ

8 September - చక్రవర్తి జయంతి



పల్లవి :
శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం (2)
మాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం
చిగురులేసే సిగ్గు చీనాంబరాలు
తడిసి కురిసే కళ్లు నీ తలంబ్రాలు ॥
చరణం : 1
కనుబొమల నడుమ విరిగింది శివధనుసు
కన్నుల్లో మెరిసింది కన్నె సీత మనసు॥
ఆ రామచంద్రుడు నెలవంకలిస్తాడని (2)
పొడిచింది ఓ చుక్క బుగ్గలో ఇప్పుడు
అందాలకెందుకు
గంధాల పూతలు (2)
కళ్లకే వెలుతురు
మా పెళ్లికూతురు
ఈ పెళ్లికూతురు... ॥
చరణం : 2
అడగలేదు అమ్మనైనా
ఏనాడు ఆకలని
అలుసు చేయవద్దు
మీరు తానేమి అడగదని
ఆడగబోదు సిరిసంపదలు
ఏనాడూ పెనిమిటిని
అడిగేదొక ప్రేమ అనే పెన్నిధిని
చెప్పలేని మూగబాధ
చెప్పకనే తెలుసుకో
మాటలకే అందని మనసు...
చూపులతో తెలుసుకో...
రెప్పవలే కాచుకో...॥

Justice Chowdary Songs - Srilakshmi Pelliki Chirunavve - NTR Sridevi


0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |