Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

vELachUDa vennelAye - వేళచూడ వెన్నెలాయె

చిత్రం: నాటకాల రాయుడు(nATakAla rAyuDu) (1969)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : జి.కె.వెంకటేష్
గానం : పి.సుశీల
21 September - నేడు జి.కె.వెంకటేష్ జయంతి(G.K.venkatEsh)
పల్లవి :
వేళచూడ వెన్నెలాయె
లోనచూడ వెచ్చనాయె
ఎందుకోమరి తెలియదాయె
రేయి మాత్రం గడచిపోయె॥
చరణం : 1
కొమ్మకొమ్మకు చిగుళ్లాయె
గుండె నిండా గుబుళ్లాయె॥
పువ్వు పువ్వున తుమ్మెదాయె
పొంగు వయసుతో పోరులాయె॥
చరణం : 2
కునుకుపడితే ఉలికిపడుతాయె కునుకుపడితే ఉలికిపడుతాయె
మెలుకువైతే కునుకురాదాయె
వల్లమాలిన వగలతోటే
ఘల్లుఘల్లున తెల్లవారె॥
చరణం : 3
సరసమెరుగని చందమామ
చాటుమాటుగ సాగిపోయే॥
వెంటనున్న చుక్క కన్నె
జంటవుండీ ఒంటరాయె॥॥


పూర్తి పేరు : గురజాడ కృష్ణదాస్ వెంకటేష్

జననం : 21-09-1927

జన్మస్థలం : హైదరాబాద్

తల్లిదండ్రులు : రాజవేణి, కృష్ణదాస్

తొలిచిత్రం : బేబి (మలయాళం) - 1947, అత్తగారు కొత్త కోడలు (తెలుగు) - 1968

ఆఖరిచిత్రం : జగన్మాత (తెలుగు) - 1987

చిత్రాలు : దాదాపు 350 కి పైగా (తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, బెంగాలీ, హిందీ, అస్సామీ, ఒరియా)

మరణం : 17-11-1993

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |