disturb chEstunnADe - డిస్టర్బ్ చేస్తున్నాడు
చిత్రం: దేవుడు చేసిన మనుషులు(dEvuDu chEsina manushulu)రచన : భాస్కరభట్ల
సంగీతం: రఘుకుంచె, గానం: సుచిత్ర
డిస్టర్బ్ చేస్తున్నాడు దొంగపిల్లగాడు
సతాయిస్తున్నాడు చిచ్చుబుడ్డిగాడు
కళ్లోకొస్తున్నాడు రేతిరంతా ఈడు
పిచ్చెక్కిస్తున్నాడు అమ్మ కంతిరోడు
ఊరికే ఊరుకోడే
బొత్తిగా తుంటరోడే
నవ్వుతా గిల్లుతాడే
నన్నిలా బతకనీడే
అబ్బో వీడికంత సీను ఉందా
అనుకున్న గానీ
బాబోయ్ లవ్‌లోకి దింపాడే//డిస్టర్బ్//
చరణం : 1 ఎటేపెల్తే అటు వచేస్తడే
గుడ్లూ మిటకరించి చూసేస్తడే
గండు చీమలాగ పట్టేస్తడే
ఎంత తిట్టుకున్న నచ్చేస్తడే//ఎటేపెల్తే//
తిరగా మరగా తిప్పేస్తడే
తిన్నగా ఒళ్లోకొచ్చేస్తడే
పగలూ రాత్రీ తేడాలేదే
పొలమారించీ చంపేస్తడే//డిస్టర్బ్//
చరణం : 2
చూపుల్తోనే ఈడు మింగేస్తడే
చూయింగ్ గమ్ములాగ నమిలేస్తడే
చున్నీలాగ నను చుట్టేస్తడే
ఛూ... మంత్రమేదో వేసేస్తడే//చూపుల్తోనే//
అక్కడా ఇక్కడా చెయ్యేస్తడే
అతలాకుతలం చేసేస్తడే
నాలో నాకే తగువెట్టేసీ పొగలు
సెగలు పుట్టిస్తడే //డిస్టర్బ్//