Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

EswarI jayamu nIvE - ఈశ్వరీ జయము నీవే

చిత్రం : రాజకోట రహస్యం(rAjakOTa rahasyam) (1971)
రచన : పింగళి నాగేంద్రరావు
సంగీతం : విజయా కృష్ణమూర్తి
గానం : ఘంటసాల, బృందం


శ్లోకం :
సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే
పల్లవి :
ఈశ్వరీ జయము నీవే పరమేశ్వరీ అభయమీవే ఈశ్వరీ జయము నీవే పరమేశ్వరీ అభయమీవే
చరణం : 1
సూర్యులు కోటిగ చంద్రులు కోటిగ
మెరసిన తేజము నీవే దేవి
శక్తి వర్ధనివి వరదాయినివే (2)
ఇహమూ పరమూ నాకిక నీవే॥
చరణం : 2
మంత్రతంత్రముల మాయల ప్రబలిన
క్షుద్రుల పీడకు బలియగుటేనా
దుష్టశక్తులను రూపుమాపగ... (2)
మహా మహిమనే నాకిడ లేవా॥
చరణం : 3
నిరపరాధులగు తల్లిదండ్రులు సతి
క్రూరుని హింసకు గురియగుటేనా
దుర్మార్గులనిక నాశము చేసి (2)
తరించు వరమిడి దయగనరావా॥
ఓం నారాయణి... ఓం నారాయణి
చరణం : 4
ప్రాణము లైదుగ వేదనలైదుగ
పరిపరి విధముల నినువేడితినే
అమోఘ మహిమల ఆదిశక్తివే
ఓం నారాయణి... ఓం నారాయణి
అమోఘ మహిమల ఆదిశక్తివే
చలమూ బలమూ నాకికనీవే దేవి... దేవి...
ఓం నారాయణి... ఓం నారాయణి (2)

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |