intEnayA telusukOvayA - ఇంతేనయా తెలుసుకోవయా
చిత్రం : కథానాయకుడు(KathAnAyakuDu) (1969)రచన : దాశరథి
సంగీతం : టి.వి.రాజు
గానం : ఘంటసాల, బృందం
05 November - నేడు దాశరథి వర్ధంతి
ఇంతేనయా తెలుసుకోవయా...
ఈ లోకం ఇంతేనయా॥
నీతీ లేదు నిజాయితీ లేదు
ధనమే జగమయ్యా
చరణం : 1
డాబులుకొట్టి మోసం చేసి
జేబులు నింపేరు (2)
పాపం పుణ్యం పరమార్థాలు
పంచకు రానీరు
ఎవరికివారే యమునాతీరే
ఇదే ప్రపంచమయా॥
చరణం : 2
పైసాతోటి సీసా చేరి
జల్సా చేసింది (2)
మనసే లేని సొగసేవుండి
మైమరపించింది
పైన పటారం లోన లొటారం
ఇదే ప్రపంచమయా॥
చరణం : 3
మంచిని చేసే మనిషిని నేడు
వంచన చేసేరు (2)
గొంతులు కోసేవాడికి
నేడు గొడుగులు పట్టేరు
దొంగలు దొరలై ఊళ్లే దోచిరి
ఇదే ప్రపంచమయా॥