paTTukO paTTukO - పట్టుకో పట్టుకో
చిత్రం : ఛాలెంజ్ రాముడు(ChAleng rAmuDu) (1980)
రచన : వేటూరి, సంగీతం : చక్రవర్తి
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల
పల్లవి :
పట్టుకో గుట్టుగా కట్టుకో చుట్టుకో
నీలాల నీ మబ్బుచీర ॥
సిగ్గులేదా ఎగ్గులేదా చీరలేని చిన్నదానా
అహా... ఎందుకూ?
పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీర
చీరలా చుట్టుకో పైటలా కప్పుకో
నీ చూపు నా చుక్కచీర ॥
సిగ్గులేలా చిన్నవాడ నీలోనే నేనులేనా॥॥
చరణం : 1
పైటేస్తే జారిపోయే గాలేస్తే చీరపోయే
చలి నాలో ముదిరిపోయే
జత నీతో కుదిరిపోయే
కన్నేస్తే కందిపోయే
చేయేస్తే కుదిరిపోయే
ప్రేమ నీకు పెరిగిపోయే
పెళ్లి నాకు జరగదాయే
మంచిరోజు చూసి
నువ్వు లగ్గమెట్టుకో
మల్లెపూలు తెల్లచీర
సారె పెట్టుకో అట్టాగే...
అట్టాగే అంటుంటే
ఇట్టాగే ఉండుండి
ఆశలన్నీ అడుగంటులు తొందరపడవే
ఆ... చూద్దాం లే... ॥॥
చరణం : 2
మెరుపులాంటి నిన్ను చూశా
ఉరుముతున్న వన్నె చూశా
అహ చిలికి చిలికి గాలివానై
కమ్ముకొస్తే కలిసిపోతా
పిడుగులాంటి నిన్ను చూశా
గొడుగులాంటి నీడ చూశా
కదిలి కదిలి కన్నెవాగై
కౌగిలిస్తే పొంగిపోతా
మూడుముళ్లు పడ్డదాకా ముద్దులాపుకో
తలుపు గడియ పడ్డదాక వలపులాపుకో
అట్టాగే అంటుంటే ఇట్టాగే ఉండుండి
చీరెగిరి పోతాది గుర్తుపెట్టుకో...
అమ్మ బాబోయ్...॥॥