Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

Featured Post

dheem tanak dheem - ధీం తనక్ ధీం

dheem tanak dheem - ధీం తనక్ ధీం

చిత్రం : వారసుడు(vArasuDu) (1993)
రచన : వెన్నెలకంటి
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర

పల్లవి :
ధీం తనక్ ధీం... ధీం తనక్ ధీం
కొత్తగుంది ప్రేమ.. ఓ...
ఈ పరిచయం ఈ అనుభవం
మత్తుగుంది భామా... ఓ...
ఈనాడే తెలిసింది నీ తోడే కలిసింది
జగమే సగమై యుగమే క్షణమై ఉందామా
వలేసి కలేసి నిలేసి మనసున॥తనక్ ధీం॥
చరణం : 1
చలో మేరీ స్వీటీ బుల్ బుల్ బ్యూటీ
భలేగుంది భేటీనీతోటి
నిదానించు నాటీ ఏమా ధాటి
మజా కాదు పోటీ మనతోటి
సిగ్గు లూటీ చేసెయ్యి కళ్లతోటి
ఇచ్చేయి ముద్దు చీటీకౌగిళ్లు దాటి
ఒకటే సరదా వయసే వరద
కలలే కనక కథలే వినక మర్యాద
చురుక్కు చలెక్కి అడక్క అడిగిన॥తనక్ ధీం॥
చరణం : 2
ఇదేం ప్రేమ బాబూ ఇలా చంపుతుంది
అదే ధ్యాస నాలో మొదలైంది
పదారేళ్ల ప్రేమ కథంతేను లేమ్మా
అదో కొత్త క్రేజీ హంగామా
పొద్దుపోదు ముద్దైనా ముట్టనీదు
నిద్రైనా పట్టనీదు నా వల్ల కాదు
ఒకటే గొడవ ఒడిలో పడవా
నిన్న మొన్న లేనే లేదు ఈ చొరవ
ఇవాళ ఇలాగ దొరక్క దొరికిన॥తనక్ ధీం॥

Comments