parugulu tiyyAli - పరుగులు తియ్యాలి
చిత్రం : మల్లీశ్వరి (mallIswari)(1951)రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : ఘంటసాల, భానుమతి
24 February - నేడు దేవులపల్లి కృష్ణశాస్త్రి వర్ధంతి
పల్లవి :
హేయ్... పరుగులు తియ్యాలి
గిత్తలు ఉరకలు వేయాలి (2)
హేయ్... బిరబిర చరచర పరుగున పరుగున
ఊరు చేరాలి మన ఊరు చేరాలి... ఓ...
హోరుగాలి కారుమబ్బులు (2)
ముసిరేలోగా మూగేలోగా
ఊరు చేరాలి మన ఊరు చేరాలి
గలగల గలగల కొమ్ముల గజ్జెలు
ఘణఘణ ఘణఘణ మెళ్లో గంటలు
ఆ... గలగల గలగల
కొమ్ముల గజ్జెలు
ఘణఘణ ఘణఘణ
మెళ్లో గంటలు
వాగులు దాటి
వంకలు దాటి
ఊరు చేరాలి
మన ఊరు చేరాలి
చరణం :
ఆ... అవిగో అవిగో...
నల్లని మబ్బులు గుంపులు గుంపులు
తెల్లని కొంగలు బారులు బారులు
అవిగో అవిగో... అవిగో అవిగో॥
ఆ... పచ్చని తోటల విచ్చిన పూవులు
ఊగే గాలుల తూగే తీగలు... అవిగో...
కొమ్మల మోగే కోయిల జంటలు
ఝుమ్మని మూగే తుమ్మెద గుంపులు
అవిగో అవిగో... అవిగో అవిగో...