Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

rAgamO anurAgamO - రాగమో అనురాగమో

చిత్రం : నాలుగు స్తంభాలాట (nAlugu stambhAlATa)(1982)
రచన : వేటూరి, సంగీతం : రాజన్-నాగేంద్ర
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి

పల్లవి :
రాగమో అనురాగమో గీతమో సంగీతమో
నా గుండెలో ఓ కోయిల పూదండలో సన్నాయిలా
వలచి పిలిచే మత్తుగా కొత్తగా లవ్ మీ లవ్ మీ॥
చరణం : 1
సూరీడు చల్లారు నీ చూపు
చలిగాలిలా వీచె నావైపు
పరుగెత్తే పరువంలోన పడగెత్తే ప్రణయంలాగ
సాగిపోవాలి జతగా
నీ కంటిలో ఉన్న చలిమంట
తొలిగంట కొట్టింది నా కంట
పయనించే గగనంలోన కలిపే ఋతుపవనంలాగ
జల్లు రావాలి వడిగా
ఈ వడిలో ఉరవడిలో ముడివడి పోవాలి
కాలమెంత దూరమో కలిసి చూడగా॥
చరణం : 2
సందెల్లో మందార బొట్టుంది
అందాల ముద్దిచ్చి అంటింది
సెలయేటి అలజడిలోన చెలరేగే అల్లరిలాగ
ఊగిపోవాలి కలిసి
సిగ్గుల్లో చిగురంత ఎరుపుంది
వత్తుల్లో వరసైన వలపుంది
నాజూకు నడకల్లోన నలిగేటి మొలకల్లాగ
ఆవిరవ్వాలి అలసి
ఆవిరిలో నా విరులే విరవిరలాడాలి
కౌగిలింత నేనుగా కలిసి చేరగా॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |