Adi dampatulE - ఆదిదంపతులే
చిత్రం : మిథునం(mithunam) (2012),
సంగీతం : వీణాపాణి,రచన : జొన్నవిత్తుల,
గానం : కె.జె.ఏసుదాస్
అచ్చతెలుగు మిథునం ’’ఆది’’
అవని దంపతులు ఆరాధించే
ముచ్చటైన మిథునం ’’అవని’’
సుధాప్రేమికుల సదనం
సదాశివుని మా రేడువనం
సదాశివుని మారేడువనం ’’ఆది’’
చరణం : 1
దాంపత్య రసజ్ఞుడు
ఆలికొసగు అనుబంధ సుగుంధ ప్రసూనం
నవరసమాన సమరసమాన (2)
సహకార స్వరమే వనం
భారతీయతకు హారతి పట్టే
ఋషిమయ జీవనవిధానం
భార్య సహాయముతో
కొనసాగే భవసాగర తరణం
భవసాగర తరణం... ’’ఆది’’
చరణం : 2
అల్ప సంతసపు కల్పవక్షమున
ఆత్మకోకిలల గానం
పురుషార్థముల పూలబాటలో
పుణ్యదంపతుల పయనం
అరవై దాటిన ఆలుమగల... (2)
అనురాగామత మథనం
గహస్థ ధర్మం సగర్వమ్ముగా
తానెగరేసిన జయకేతనం... జయకేతనం...
*********