vastAvu pOtAvu - వస్తావు పోతావు
చిత్రం : పూజాఫలం (pUjAphalam) (1964)
రచన : కొసరాజు(kosarAju)సంగీతం : సాలూరి రాజేశ్వరరావు(sAluri rAjEswararao)
గానం : బి.వసంత(B. vasanta)
వచ్చి కూర్చున్నాడు నీకోసం
యముడు వచ్చి
కూర్చున్నాడు నీకోసం
చరణం : 1
పొరపాటు పడి చేత
దొరికిపోయావంటే
నా బంగారు చేపా... ఆ...
డొక్క చీలుస్తాడు డోలు కట్టిస్తాడు॥
చరణం : 2
నిక్కి నిక్కి పైకి చూసేవూ
తళుకు బెళుకు చూసి మురిసేవూ
కదలలేడనిపించి కలలు కన్నావంటే
కదలలేడనిపించి కలలు కన్నావంటే
బొక్క ముక్కలు చేసి
తిక్క వదిలిస్తాడు॥
Special Notes:
మార్చి 29, 1944లో మచిలీపట్నంలో జన్మించారు బి.వసంత. పూర్వీకులు సంగీతంలో ప్రావీణ్యం ఉన్నవారు కావడంతో చిన్నప్పటి నుండే సంగీతంపై అభిరుచి పెరిగింది. ‘వాగ్దానం’ (1961) సినిమాలో ‘మా కిట్టయ్య పుట్టిన దినం’ అనే పాట (పిఠాపురంతో యుగళం) ఆమె తొలిపాట. అక్కడినుండి ఆమె స్వరప్రస్థానం దాదాపు మూడున్నర దశాబ్దాల పైగా సాగింది. ఇప్పటికీ కూడ ఆమె గొంతు సంగీత అభిమానులకు ప్రియం. ఆమె చిన్న చెల్లెలైన సావిత్రి కూడ చాలా సినిమాల్లో పాటలు పాడారు. ఈ సావిత్రి కుమారుడే ఇప్పుడు యంగ్ మ్యూజిక్ డెరైక్టర్ ఎస్.ఎస్.థమన్. అలాగే మంగళంపల్లి బాలమురళీకృష్ణకు ప్రథమ శిష్యుడైన మోహనకృష్ణ బి.వసంతకు వరుసకు తమ్ముడు అవుతాడు. నేడు ఆమె 70వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు.