Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

are are are gunDe - అరె అరె అరె గుండె

చిత్రం : గుండెజారి గల్లంతయ్యిందే(gunDejAri gallantayyindE) (2013)

రచన : కృష్ణచైతన్య
సంగీతం : అనూప్ రూబెన్స్
గానం : అనూప్ రూబెన్స్, శ్రావణి, బృందం

పల్లవి :
అతడు: అరె అరె అరె...
గుండెజారి గల్లంతయ్యిందే
నీ సొగసే చూసి
గుండెజారి గల్లంతయ్యిందే...
కళ్లలో కళ్లలోన మైకం
చిన్నారి కళ్లలోన వయ్యారి మైకం
మెరిసే మెరిసేటి లోకం
ముడిపడిపో అంది మైకం
తేనెకళ్ల హొయలన్నీ ఓరచూపే చూసెనులే
ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్లా నీ వల్లేనా
బృందం: అరె అరె అరె...
గుండెజారి గల్లంతయ్యిందే నీ సొగసే చూసి
గుండెజారి గల్లంతయ్యిందే...॥కళ్లలో॥
చరణం : 1
అ: అరె... ఓ పిల్లా చాల్లే వెయ్యమాకే వేషాలే
నీ నఖశిఖలే చాల్లే మదిని ఊపకే ఉయ్యాలే
ఆమె : నిన్నుకోరి వచ్చానయ్యా ఓ రామయా
చిట్టి గుండెనే నువ్వే చురా లియా
ముందు వెనుక చూడనే ప్రియా
మే దిల్ దియా మనసు చూస్తే
ఆడే దాండియా
అ: వీడిపోనే నిన్ను విడిచిపోనే
అందకుండా ఉండిపోనే
ఆ: అడుగు దూరంలో ఉన్నావా
మాటవింటే మైకమొచ్చెనే॥అరె॥॥కళ్లలో॥
చరణం : 2
అ: హో... నిన్ను చూస్తే చాల్లే
గాజుపూల వర్షాలే
హో... నువు వస్తే చాలే జాజిపూల జంపాలే
ఆ: కోతలింక వద్దులేవయా సునో ప్రియా
ఊసుపోక ఊసులెన్నో విన్నానయా
ఆదమరచి ఆడుతున్న ఈ చెలియా
ఏరికోరి నీకు దిల్ దియా
అ: నిన్నుకోరి దూరం అంతా చేరువయ్యె చనువంత
ఆ: మనసులోని అణువణువంతా నిండిపోతే
తప్పుయేంటటా॥అరె॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |