alalE pomgenu - అలలే పొంగేను
చిత్రం : సంభవామి యుగేయుగే (sambhavAmi yugEyugE)(2005)
రచన : కృష్ణచైతన్యసంగీతం : అనిల్. ఆర్
గానం : రాంకీ
పల్లవి :
అలుపే రాదంది ఈ గంగ
స్నేహం స్వరంలా నాతో వరంలా
కథకాని తీపి కలలా...
అలలే పొంగేను వేగంగా
అలుపే రాదంది ఈ గంగ
మొదలంటూ లేదు... తుదికంటూ రాదు
మిగిలుంది పోనివ్వు అలా
చరణం : 1
ఏనాటి బంధం మదిలో ఆనందం
నుదిటిరాత అనుకో...
మీ వెంటే నేను సరి నా వెంటే మీరు
విడని తోడు అనుకో...
పసి మనసులన్నీ ఈ వేళ
ఒకటైనదేమో అది నీ లీల...
చరణం : 2
చీకటి పోని... వెలుగంతా రాని మన ని ఒక్కటననీ...
ఓ... ఆడిందే ఆట మేం పాడిందే పాట
ఒట్టేసి అన్నమాట...
సెలయేటి పైన చిన్ని వాన
విడలేము నిన్ను ఓ క్షణమైనా
కలిసే ఉంటాము... కలలే కంటాము
కనులన్నీ కలల అలలే
అలలే పొంగేను వేగంగా
అలుపే రాదంది ఈ గంగా
దేహం నాదంటూ... ప్రాణం నీదంటూ
జననం నీతోనే... మరణం నీతోనే...
Special Note:
అనిల్ పూర్తిపేరు తుమ్మా అనిల్‌రెడ్డి. మే 25, 1974లో గుంటూరు జిల్లాలోని రెంటచింతలలో పుట్టారు. సంగీత దర్శకుడిగా ‘సంభవామి యుగేయుగే’ చిత్రం ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ తర్వాత నిన్న నేడు రేపు, గ మ్యం, కళవర్ కింగ్, ఔఆగి వంటి చిత్రాలకు సంగీతం అందించారు. ఏప్రిల్ 22, 2011లో మరణించారు.