O nADu washingtonlO - ఓ నాడు వాషింగ్టన్‌లో
చిత్రం : గ్రీకువీరుడు(greeku veeruDu) (2013)
రచన : సాహితిసంగీతం : ఎస్.ఎస్.థమన్
గానం : ఎస్.పి.బాలు, బృందం
పల్లవి :
అతడు:
ఓ నాడు వాషింగ్టన్‌లో
స్కేటింగ్ చేస్తూ ఉండంగా
మబ్బుల్లో జాబిలిలాగా నేనా పిల్లని చూశాగా
కళ్లే చెదిరే ఆ అందం నా ముందే కనిపించంగా
నే సంబరపడిపోయా
తను తికమక పడుతూ నాపై పడిపోయే
హాస్పిటిల్‌లో చేర్చాక ఆ పిల్లే ఓ డాక్టర్‌గా
తొలి పరిచయమయ్యాక
నే మాటలు కలిపేశాలే సరదాగా
బృందం: వింతగ మొదలే అయిన
స్నేహమే అలా ప్రేమగ మారేనంటా
ఎప్పటినుంచో కన్న తీయని
నా కల అప్పుడు తీరేనంటా॥నాడు॥
చరణం : 1
బృం: ప్యారీ ప్యారీ నీ లవ్‌స్టోరీ
చివరకు ఎట్టా గెలిచిందో చెపుతావా ఓ బావా
అ: అదో భారీ సో లాంగ్ స్టోరీ
ఓ... బాక్సింగు మల్లన్న ఆ పిల్ల తండ్రి
తిప్పులు తిప్పాడే ఎన్నో తిప్పలు పెట్టాడే
ఓ... నా ఒళ్లు గుల్లైన చేశాను
వాడి పిల్ల కోసమే ఓ మల్లయుద్ధమే
ప్రేమకోసం మృత్యువుతో పోరాడి నేనోడంగా
మనసెంతో వేదనగా
తన కన్నులు జడివానలనే కురవంగా
బిడ్డకోసం తన పంతం
ఆ తండ్రే విడిచేయంగా
నా చెలియే నవ్వంగా
తన ప్రేమనే నీ గెలిచాగా గర్వంగా
బృం: నీ కథ వింటూ ఉంటే
నిండు ప్రేమలో మా ఎద ఉయ్యాలూగే
నీ ఎద తుళ్లే ఆడే పెళ్లి బాటలో ఈ కథ ఎలా సాగే
చరణం : 2
అ: చాదస్తాలా ఆ పిల్లా తల్లి
సాంప్రదాయంతో మతినే పోగొట్టే మా త ల్లి
నన్నే పిలిచి అల్లం టీ ఇచ్చి
హే... తిథి వారఫలాల మేలైన జోడీ
కుదిరినప్పుడే మేళతాళాలందిలే
హే... ధీటైన గుర్రాన్నే నేనెక్కి
స్వారీ చేసినప్పుడే పెళ్లి లగ్గాలందిలే
తాతలనాటి శీలూడి వేలాడే కత్తే ఇచ్చి
నా చేతే పట్టించి నా నడుముకి చమ్కీ పట్టి కట్టింది
పోటాపోటీ ఆ కుస్తీ రంగాన్నే వేదిక చేసి
విరిజల్లుల జడిలోని మహ సందడిగా
మా పెళ్లే జరిపింది
బృం: కాలం కలిసే ఉంటే
మీ కళ్యాణమే ఇక్కడ జరిగుండేది
పెళ్లి వైభోగాన్ని మేమూ చూసుంటే ఎంతో బాగుండేది॥నాడు॥