sAyamkAlam - సాయంకాలం
చిత్రం : చాలెంజ్(chAllenge) (1984)
రచన : వేటూరిసంగీతం : ఇళయరాజా
గానం : బాలు, జానకి, బృందం
పల్లవి :
నా చెలి ఒళ్లో... చలి సందళ్లో
రోజూ మోజుగా జల్సా చేయరా...
విరజాజిపూల గంధమంటి అందమంత నీదిరా
ఆమె: సాయంకాలం సాగరతీరం...
వెచ్చని ఒళ్లో... వెన్నెల గుళ్లో
తాజా మోజులే రోజూ చూడరా...
నడిరాతిరల్లే పగటిపూట రాసలీలలాడరా
చరణం : 1
అ: కాపురమొస్తే కాదంటానా
కౌగిలి నీకే లేదంటానా (2)
కవ్వించి నవ్వించి కసితీరా కరిగించి
కథ కాస్తా నడిపించనా
ఆ: ఆహాహాహాహాహా...
మరుమల్లె మరీ విచ్చుకొనే వేళ...
కళ్లు మరీ గిచ్చుకునే వేళ (2)
రానంటానా పొదరింటికీ
పూతకొచ్చీ పండుతున్న పులకరింత వేళకీ
అ: సాయంకాలం... ఆ: సాగరతీరం...
చరణం : 2
ఆ: సిగ్గని చెప్పి పొమ్మంటానా
చక్కెర విందే లేదంటానా (2)
రేపంటూ మాపంటూ అంతటితో
ఆపంటూ తెల్లారీపోనిస్తానా
అ: లాలాలాలాల...
చెలిగాలి మరీ చంపితినేవేళా...
జంటచలీ పెంచుకునే వేళా (2)
రమ్మంటావా సందిళ్లకీ
ఒంటిగుండి చావలేనె సలపరింత గోలకీ॥