Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

ఆరడుగుల బుల్లెట్టు - Aaradugula Bullet


చిత్రం : అత్తారింటికి దారేది..(attAriNTiki dArEdi)(2013)

రచన : శ్రీమణి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : విజయ్ ప్రకాష్,
ఎంఎల్‌ఆర్ కార్తికేయన్ (సాకీ), బృందం

సాకీ :
గగనపు వీధి వీడి వలస వెళ్లిపోయిన
నీలిమబ్బు కోసం
తరలింది తనకు తానే ఆకాశం పరదేశం
శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన
నీటిచుక్క కోసం
విడిచింది చూడు నగమే
తనవాసం వనవాసం
పల్లవి :
భైరవుడో భార్గవుడో
భాస్కరుడో మరి రక్కసుడో
బృందం: ఉక్కు తీగలాంటి ఒంటి నైజం
వీడు మెరుపులన్ని ఒక్కటైన తేజం
రక్షకుడో తక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో
బృం: శత్రువంటూ లేని వింతయుద్ధం
వీడి గుండెలోతు గాయమైన శబ్దం
నడిచొచ్చే నర్తన శౌరి
పరిగెత్తే పరాక్రమ శైలి
హాలాహలం భరించిన ధగ్ధ హృదయుడో
వీడు ఆరడుగుల బుల్లెట్టు...
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు...॥
చరణం : 1
దివి నుంచి భువి పైకి భగ భగమని కురిసేటి
వినిపించని కిరణం చప్పుడు వీడు
వడి వడిగా వడగళ్లై దడ దడమని జారేటి
కనిపించని జడివానేగా వీడు
శంఖంలో దాగేటి
పోటెత్తిన సంద్రం హోరితడు
శోకాన్నే దాటేసే అశోకుడు వీడురో॥ఆరడుగుల॥
చరణం : 2
తన మొదలే ఒదులుకొని
పెకైదిగిన కొమ్మలకి
చిగురించిన చోటుని చూపిస్తాడు
తన దిశనే మార్చుకొని
ప్రభవించే సూర్యుడికి
తన తూరుపు పరిచయమే చేస్తాడు
రావణుడొ రాఘవుడొ
మనసును దోచే మాధవుడో
సైనికుడొ శ్రామికుడొ అసాధ్యుడు వీడురో॥ఆరడుగుల॥॥


Watch the following Songs With Lyrics :
Attarrintiki Daaredi Movie || Bapu Gari Bommo Full Song With Lyrics || Pawan Kalyan, Samantha
Attarrintiki Daaredi Movie || Kirraaku Full Song With Lyrics || Pawan Kalyan,Samantha, Pranitha
Attarrintiki Daaredi Movie || ItsTime To Party Song With Lyrics|| Pawan Kalyan,Samantha, Pranitha
Attarrintiki Daaredi Movie || Ninnu Chudagane Full Song With Lyrics || Pawan Kalyan, Samantha

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |