Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

ninnu vidisi - నిన్ను విడిసి

పల్లవి :
నిన్ను విడిసియుండలేనయా... (2)
కైలాసవాసా.... నిన్ను విడిసియుండలేనయా॥
చరణం : 1
నిన్ను విడిసియుండలేను
కన్నతండ్రివగుటచేత (2)
ఎన్నబోకు నేరములను సిన్నికొమరుడనయ్యా శివా॥
చరణం : 2
సర్వమునకు కర్త నీవు సర్వమునకు భోక్త నీవు (2)
సర్వమునకు ఆర్త నీవు పరమపురుషభవా॥॥
చరణం : 3
వరదపద్మ ఫాల శంభో... శంభో
వరదపద్మ ఫాల శంభో... బిరుదులన్నీ గలవు నీకు॥
కరుణతోడ బ్రోవకున్న బిరుదులన్నీ సున్నాలన్నా (2)॥॥
నిన్ను విడిసియుండలేనయా మహదేవశంభో
నిన్ను విడిసియుండలేనయా కైలాసవాసా॥

*******

పల్లవి :
అంటీ అంటక
ఇంటి మోహము విడవలెను (2)
నిజముగాదని మది నిలచుండవలెను
నిజముగాదని మది నిలచుండవలెను॥అంటక॥
చరణం : 1
ధీరుడై సౌఖ్యములు దిగనాడవలెను (2)॥అంటక॥
చరణం : 2
మాతాపితరాచార మమత విడవలెను (2)
భాగవత జనుల సంభాషించవలెను॥॥అంటక॥
చరణం : 3
అన్నిటా హరి ఉండునని తెలియవలెను (2)॥అంటక॥
చరణం : 4
మదగర్వ మృగమును మర్దించవలెను
ఎరుకల ఏవేళా వెలుగు కనవలెను॥అంటక॥
తత్త్వాలు

సంగీతం, గానం: డా॥మంగళంపల్లి బాలమురళీకృష్ణ

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |