Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

bongarAlanTi - బొంగరాలంటి

bongarAlanTi - బొంగరాలంటి

గీత స్మరణం : అత్తారింటికి దారేది చిత్రంలోని ఓ పాట
 పల్లవి :  బొంగరాలంటి కళ్లు తిప్పింది
   ఉంగరాలున్న జుట్టు తిప్పింది
 గింగిరాలెత్తే నడుమొంపుల్లో
   నన్నే తిప్పింది
 అమ్మో బాపుగారి బొమ్మో
   ఓలమ్మో మల్లెపూల కొమ్మో
 రబ్బరుగాజుల రంగు తీసింది
   బుగ్గల అంచున ఎరుపు రాసింది
 రిబ్బను కట్టిన గాలిపటంలా నన్నెగరేసింది
 అమ్మో దాని చూపు గమ్మో ఓలమ్మో ఓల్డు మాంక్ రమ్మో
 పగడాల పెదవుల్తో పడగొట్టిందీ పిల్లా
 కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది
 ఏకంగా ఎద పైనే నర్తించింది అబ్బా...
 నాట్యంలోని ముద్దర చూసి నిద్దరే నాదే పోయింది॥
 చరణం : 1
 మొన్న మేడ మీద బట్టలారేస్తూ కూనిరాగమేదో తీసేస్తూ
 పిడికెడు ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్లా
 నిన్న కాఫీ గ్లాసు చేతికందిస్తూ నాజూకైన వేళ్లు తాకిస్తూ
 మెత్తని మత్తుల విద్యుత్ తీగై ఒత్తిడి పెంచిందే మళ్లా
 కూరలో వేసే పోపు నా ఊహల్లో వేసేసింది
 ఓరగా చూసే చూపు నా వైపే అనిపిస్తుంది
 పూలలో గుచ్చే దారం నా గుండెల్లో గుచ్చేసింది
 చీర చెంగు చివరంచుల్లో నన్నే బందీ చేసింది
 పొద్దు పొద్దున్నే హల్లో అంటుంది
 పొద్దుపోతే చాలు కల్లోకొస్తుంది
పొద్దస్తమానం పోయినంత దూరం గుర్తొస్తుంటోంది॥
 చరణం : 2
 ఏ మాయలోకంలోనో నను మెల్లగ తోసేసింది
 తలుపులు మూసింది తాళం పోగొట్టేసింది
 ఆ మబ్బుల అంచులదాకా నా మనసును మోసేసింది
 చప్పుడు లేకుండా నిచ్చెన పక్కకు లాగింది
 తిన్నగా గుండెను పట్టి గుప్పిట పెట్టి మూసేసింది
 అందమే గంధపు గాలై మళ్లీ ఊపిరి పోసింది
 తియ్యని ముచ్చటలెన్నో ఆలోచన్లో అచ్చేసింది
 ప్రేమనే కళ్లద్దాలు చూపులకే తగిలించింది
 కోసల దేశపు రాజకుమారి ఆశలు రేపిన అందాల పోరీ
 పూసల దండలో నన్నే గుచ్చి మెళ్లో వేసింది॥

చిత్రం : అత్తారింటికి దారేది.. (AttArinTiki dArEdi)(2013)

 రచన : రామజోగయ్యశాస్త్రి
 సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, గానం : శంకర్ మహదేవన్

Comments