Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

jabilli nuvvE - జాబిల్లి నువ్వే

చిత్రం : రామయ్యా వస్తావయ్యా - rAmayyA vastAvayyA (2013)

 రచన : అనంత  శ్రీరామ్
 సంగీతం : ఎస్.ఎస్.థమన్
 గానం : రంజిత్, బృందం
గీత స్మరణం
 పల్లవి :
 సగమప మప మప గరి రిగరీ... (2)
 గరిసా రిసరి నిసా సరిసా     (2)
 జాబిల్లి నువ్వే చెప్పమ్మా...
 బృందం: నువ్వే చెప్పమ్మా
 ఈ పిల్లే వినడం లేదమ్మా
 బృం: అబ్బే వినదమ్మా
 ఓ చుక్కా నువ్వే చూడమ్మా
 బృం: నువ్వే చూడమ్మా
 మీ అక్కని మాటాడించమ్మా
 మేఘాల పైనుండి వస్తారా ఓసారి
 రాగాలే తియ్యంగా తీయగా
 చిగురాలే అమ్మాయి
   ఉయ్యాల ఈ రేయి
 జోలాలి పాడాలి హాయిగా
 ॥॥
 చరణం : 1 
 నలుపెక్కిన మబ్బుల్లోన
 నలుదిక్కుల ఓ మూలైనా
 కళ్లే మెరుపల్లే తుళ్లే తుళ్లే...
 వడగాలుల వేసవిలోన చలచల్లగ ఓనాడైనా
 జల్లే చినుకుల్నే జల్లే జల్లే...
 ప్రాణం కన్నా ప్రేమించే నీవాళ్లున్నారే
 ఆనందం అందించి అందాలే చిందాలే
 ఆపైన ఉన్నోళ్లు తీపైన మనవాళ్లు
   అడిగేది నీ నవ్వులే
 చరణం : 2 
 చిరునవ్వు నవ్వావంటే
 పొరపాటని ఎవరంటారే
 పిట్టా నవ్వే వద్దంటే ఎట్టా...
 సరదాగ కాసేపుంటే సరికాదని దెప్పేదెవరే
 ఇట్టా ఇస్తావా వారి చిట్టా...
 కొమ్మారెమ్మా రమ్మంటే నీతో వచ్చేయ్‌వా
 గారంగా మారంగా కోరిందే ఇచ్చేయ్‌వా
 నీతోటి లేనోళ్లు నీ చుట్టూ ఉన్నారు
 కళ్లారా ఓసారి చూడవే...
 ॥॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |